మెగా ప్రిన్స్ Varun Tej గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన కెరీర్లో మంచి మంచి సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 1వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో వరుణ్ తేజ్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
ఆయన వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా వరుణ్ తేజ్ తన అన్నయ్య రామ్ చరణ్ తో గొడవ పడిన సంఘటనలను కూడా ఈ ఇంటర్వ్యూల సందర్భంగా వెల్లడించడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎప్పుడూ ఎంతో ప్రశాంతంగా కనిపించే చరణ్ వరుణ్ తో గొడవ పడటం ఏంటి అసలు వీరిద్దరి మధ్య గొడవకు గల కారణాలేంటి అని ఆలోచనలో పడ్డారు.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘నాకు చరణ్ అన్నయ్యకు చిన్నప్పుడు తరచూ గొడవలు జరిగేవని తెలియజేశారు. చిన్నప్పుడు చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పలు యాడ్స్ చేసేవారు. చరణ్ పవన్ కళ్యాణ్ అభిమాని అని వరుణ్ చిరంజీవి అభిమాని అట. పెదనాన్న చేసిన యాడ్ బాగుందని వరుణ్ అంటే లేదు బాబాయ్ చేసిన బాగుందని ఇద్దరు పెద్ద ఎత్తున గొడవపడేవారట. చిరంజీవి ఇంట్లో ఉన్నంతవరకు తాను సేఫ్ జోన్ లో ఉండేవాడినని పెదనాన్న బయటకు వెళ్లగానే చరణ్ అన్నయ్య నాతో ఓ ఆట ఆడుకునేవాడంటూ ఈ సందర్భంగా చిన్నప్పుడు వారిద్దరి మధ్య గొడవలు గురించి వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.