Anasuya : అనసూయ సినిమాపై అభిషేక్ బచ్చన్ ఫోకస్‌.. అంతగా ఏం నచ్చింది హీరో

- Advertisement -

Anasuya : యాంకర్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకుంది అనసూయ. ఓ వైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ బాగా పాపులర్ అయ్యింది. అనసూయ ఇటీవల వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు ఆరి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి ‘మై నేమ్ ఈజ్ నో బడ్డీ’ అని క్యాప్షన్ పెట్టారు. డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆరి సినిమా ఆర్‌వి రెడ్డి సమర్పణలో ఆర్‌వి సినిమాస్ బ్యానర్‌పై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పూరిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. అనసూయ భరద్వాజ్‌తో పాటు వినోద్ వర్మ, సూర్య పూరిమెట్ల, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “పేపర్ బాయ్” సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఆరి సినిమా తెరకెక్కుతోంది. ఆరి సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Anasuya

తాజాగా ఆరి సినిమాలో కీలక పాత్ర పోషించిన వినోద్ వర్మ తన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. వినోద్ వర్మ పెద్ద లైబ్రరీలో ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకుంటూ ఇంకా ఆసక్తికరంగా, పిచ్చిగా చూస్తున్నాడు. ఆరి సినిమా ప్రస్తుతం షెడ్యూల్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కాబోతోంది. ‘ఆరి’ చిత్రం త్వరలో గ్రాండ్‌గా థియేట్రికల్‌గా విడుదల కానుంది. అయితే.. ఈ సినిమా హిందీ రీమేక్‌పై బాలీవుడ్ దృష్టి సారించింది. బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ అనసూయ ఆరి సినిమాపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆరి చిత్రాన్ని విడుదలకు ముందే హిందీలో రీమేక్ చేసేందుకు అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆరి సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. ఈ వార్త తెలిసిన వారందరూ అంతలా ఆ సినిమాలో ఏం నచ్చింది హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఆరి సినిమాలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయ శెట్టి, రిధిమా పండిత్, పి. అనిల్ కుమార్, నవీన్ రెడ్డి, పావని తదితరులు నటించారు. తమిళ బిగ్ బాస్ ఫేమ్. రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మణిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవల్లిక ధోతి, సురభి విజయ్, బ్యాంక్ శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీల ప్రియ , యోగి ఖత్రి తదితరులు నటిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here