నర్సింగ్ యాదవ్ కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులను మనం ఎప్పటికీ మరచిపోలేము, ఉదాహరణకి లెక్చరర్ పాత్రలు అంటే మనకి MS నారాయణ గుర్తుకు వస్తాడు, పూజారి పాత్రలు అంటే బ్రహ్మానందం గుర్తుకు వస్తాడు,అలాగే రౌడీ పాత్రలు అంటే మనకి గుర్తుకు వచ్చే పేరు నర్సింగ్ యాదవ్. ఈయన లేని సినిమాలు అప్పట్లో అసలు ఉండేవే కాలేదు. రౌడీ పాత్రలకు ఆయన ఒక ట్రేడ్ మార్క్ లాగ నిలిచాడు. ఇతనిని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘క్షణ క్షణం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి తీసుకొచ్చాడు.
తొలిసినిమాతోనే నర్సింగ్ యాదవ్ కి మంచి పాత్రలో నటించే ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తాను తెరకెక్కించే ప్రతీ సినిమాలోనూ నర్సింగ్ యాదవ్ కి ఒక పాత్రని ఇస్తూ వచ్చాడు. అలా మంచి పాపులారిటీ ని సంపాదించిన నర్సింగ్ యాదవ్ కి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించే ఛాన్స్ దక్కింది, అలా ఆయన అన్నీ భాషలకు కలిపి 300 కి పైగా సినిమాల్లో నటించాడు.
ఆయన చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ఖైదీ నెంబర్ 150’. ఆ తర్వాత అనారోగ్యం తో కొంతకాలం ఇబ్బంది పడిన నర్సింగ్ యాదవ్ , 2020 వ సంవత్సరం లో కన్ను మూసాడు.ఆయన భార్య పేరు చిత్ర యాదవ్, ఈ దంపతులిద్దరికీ రుత్విక్ యాదవ్ అనే కుమారుడు ఉన్నాడు.వీళ్లిద్దరు రీసెంట్ గా ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో నర్సింగ్ యాదవ్ గురించి ఆయన భార్య చిత్ర చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘నా భర్త చాలా ధైర్యం ఉన్న మనిషి.ఆయనకీ ఆరోగ్యం బాగాలేదు అని తెలుసు, కానీ ఏ రోజూ కూడా ఆయన భయపడలేదు. ఈరోజు ఎలా బ్రతికాము అనేదే చూస్తాడు ఆయన. తన ఆరోగ్యం కూడా బాగా అయిపోతుందని బలంగా నమ్మేవాడు కూడా, నేను కూడా ఆయనలోని నమ్మకాన్ని పెంచే విధంగానే నడుచుకునే దానిని,కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అంటూ ఆమె మాట్లాడింది.