Niharika Konidela వల్ల విలువ లేకుండా పోయింది… ఏ రోజూ గౌరవంగా మసులుకోలేదు.. గుట్టు విప్పిన చైతన్య తండ్రి

- Advertisement -


సినీ ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా మెగా బ్రదర్ Niharika Konidela తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడిపోనుందని.. విడాకులు తీసుకోబోతుందని వార్తలు హల్ చల్ చేశాయి. కానీ ఈ విషయంపై అటు మెగా కుటుంబం గానీ ఇటు చైతన్య కుటుంబంగానీ స్పందించలేదు. కానీ వీరిద్దరికీ విడాకులు అయిపోయాయని.. ఇకనుంచి వీరిని మాజీ అని సంబోధిస్తున్నారంటూ అధికారిక ప్రకటన విడుదలైంది. హైదరాబాద్ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికి డైవర్స్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.

Niharika Konidela
Niharika Konidela

ఇక విడాకుల అనంతరం ఒకపక్క మెగా అభిమానులు నిహారిక భర్త చైతన్య పై మాటల యుద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విడాకుల వ్యవహారం ఎలా జరిగిందనేది మాత్రం ఎవరికీ అంతుపట్టని విషయం. వీరు విడిపోవడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే నిహారిక పై ఆమె తన మాజీ భర్త తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు తన కుమారుడి విడాకుల గురించి వస్తున్న వార్తలపై ఆయన సన్నిహితుల వద్ద కింది విధంగా చెప్పుకుని ఆవేదన చెందార

చైతన్య తండి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు. కొడుకు విడాకులపై మాట్లాడుతూ.. ‘నేను ఒక గౌరవమైన హోదాలో బ్రతికిన వాడిని.. నిహారిక వల్ల నా ఇంట్లోనే నాకు విలువ లేకుండా పోయింది.. ఇంట్లో పెద్ద వాళ్లతో ఒక్క రోజు కూడా గౌరవంగా మసులుకోలేదు.. అసలు సంసారం చేసే ఆలోచన లేదు.. తన భర్త పై ఎప్పుడూ ప్రేమ చూపలేదు. ఎప్పుడు చూసిన సోషల్ లైఫ్ అంటూ బయటకు వెళ్లడం.. క్లబ్బులు పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.

- Advertisement -
Niharika Konidela

చిరంజీవి ఫ్యామిలీ అంటే చాలా గౌరవం కలిగిన కుటుంబం అనుకున్నాను. కానీ నా కొడుకు గురించి మెగా అభిమానులు ఇలా మాట్లాడుతుంటే సహించలేకపోతున్నాను. వారి సోషల్ లైఫ్ కి నేను ఎప్పుడూ అడ్డుపడలేదు.. కానీ నలుగురు నా ఇంటికి వచ్చినప్పుడు మర్యాద కలిగిన కోడలి స్థానంలో నిహారిక తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. పైగా చైతన్యతో కలిసి బయటకు వెళ్లి వేరుగా జీవించమని కూడా చెప్పాను. అయిన ఆమె తన బంధాన్ని నిలుపుకోలేకపోయారు. కనీసం మీలాంటి వాళ్లైనా ఇలాంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ వరకు తీసుకెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం’ అంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారని టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here