Casting Couch : ఒకప్పుడు సినిమా ఛాన్స్ రావాలంటే చాలా కష్టపడేవారు. అందుకు మంచి టాలెంట్ కూడా ఉండాలి..అప్పుడే ప్రజలను ఆకర్షిస్తారు..సినిమాలు సూపర్ హిట్ అవుతాయి..ఆ తర్వాత అందాన్ని చూసి అవకాశం ఇచ్చే వారు.ఇప్పుడు సినిమా ఛాన్స్ లు రావాలంటే మాత్రం మొత్తం సమర్పించాలని అంటున్నారు.ఈ మధ్య ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది బలంగా వినిపిస్తోంది.ఈ సమస్య ఒక్క భాషకే పరిమితం కాలేదు. బాలీవుడ్.. టాలీవుడ్.. శాండిల్‌ఉడ్. .కోలీవుడ్.. ఇలా అన్నీ భాషలలోనూ ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది..
అయితే, ఆ కాలంలో సోషల్ మీడియా లేకపోవడంతో ఎక్కడ బయట పెడితే అవకాశాలు ఇవ్వరొ అని చాలా మంది నోరు మూసుకున్నారు.ఇక్కడ అందరూ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే ఆడవారి మీద మరీ అరాచకంగా చేసిన వారు ఎవరూ లేరనే చెప్పాలి. ఉన్నా ఆ శాతం చాలా తక్కువ. కానీ, అవకాశం కోసం వచ్చిన వారిని రక రకాలుగా హింసించినవారు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా సీనియర్సే ఇలా ఇబ్బందులకి గురిచేయడం షాకింగ్ విషయం.
టాలీవుడ్‌లో శ్రీరెడ్డి ఒక సంచలనం.. ఇలాంటి వారి లిస్ట్ ఆమె తో ఉంది. ఆమె ఎప్పుడైతే గుట్టు రట్టు చేసిందో అప్పటి నుంచే మిగతావారు ఒక్కొక్కరుగా బయటపడటం మొదలైంది. దీనికి ముందు కోలీవుడ్‌లో సుచీలీక్స్. సింగర్ సుచిత్ర ఇదే వ్యవహారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది.దాంతో అటు బాలీవుడ్‌లో ఇటు సౌత్‌లో అన్నీ భాషలలో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా ఉందనే విషయం బయటపడింది. దీనికి ఏజ్ పరిమితం అంటూ ఏమీ లేకపోవడం పెద్ద షాకింగ్ విషయం అని చెప్పాలి..
ఎంత వయస్సు వచ్చినా కూడా ఒక ఛాన్స్ కావాలంటే మాత్రం ఆ పని చెయ్యాల్సిందే.. యంగ్ డైరెక్టర్లు ముందుగా కమిట్‌మెంట్ అడుగుతున్నారు.? నా వయస్సుకు, నీ వయస్సుకు సంబంధం ఉందా ? అని వారు ప్రశ్నిస్తే.. అవన్నీ మాకు అనవసరం.. మొఖం మీద గుడ్డ వేసుకో.. నేను ఎజెస్ట్ అవుతామని ఆ డైరెక్టర్లు, నిర్మాతలు చెపుతున్నారట.ఇదే విషయాన్ని ఓ సీనియర్ నటీమణి ఓపెన్‌గా చెప్పి వాపోయింది. ఇదీ మరీ దౌర్భాగ్యం అనుకోవాలి. సిగ్గుతో వయసుకు తగ్గట్టుగా హుందాగా ప్రవర్తిస్తూ ఇలా కమిట్‌మెంట్ అడిగిన వారికి సున్నితంగా సమాధానం చెప్తూ కొందరు సీనియర్స్ నెట్టుకుంటూ వస్తున్నారు.మరి కొంత మంది మాత్రం పొట్ట కూటి కోసం తప్పక ఆ పని చేస్తున్నారు..?? ఏది ఏమైనా టాలెంట్ ఉంటే సరిపోదు.. ముందు ఆ కార్యం జరగాల్సిందే.. సో స్యాడ్..