Sai Pallavi : సాయిపల్లవి పై కేసు నమోదు.. ఇక సినిమాలకు గుడ్ బై ?

- Advertisement -


Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సహజ నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. మనసుకు నచ్చిన సినిమాలను మాత్రమే చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది. ఎంత అడిగితే అత రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా, కథ నచ్చకపోతే మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది. ఇప్పటికీ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే చేస్తూ వస్తోంది. ‘ప్రేమమ్’ సినిమాతో నటిగా కెరీర్‎ తన మొదలు పెట్టింది సాయి పల్లవి. ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఆ తర్వాత పలు టాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమాలో సీతగా కనిపించబోతోంది. తాజాగా సాయి పల్లవికి చెందిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పై ఆర్బీఐ ఫోకస్ పెట్టిందని, ఇప్పటికే తనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిందనేది వార్త సారాంశం. ఈ కేసుతో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పడటం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సాయి పల్లవి ఏం చెప్పింది? ఆర్బీఐ కేసు ఎందుకు పెట్టింది? అనేది ఏంటో తెలుసుకుందాం.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి.. తాను ఓ వెబ్ సైట్ ద్వారా పని చేయకుండా సంపాదిస్తున్నానని, రోజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు నా అకౌంట్లో పడిపోతున్నాయని చెప్పిందట. దాన్ని ఆధారంగా చేసుకుని ఆర్బీఐ చర్యలు తీసుకుంటోందన్న వార్త వైరల్ అవుతుందట. ఈ వార్తను సదరు ఛానెల్ టెలీకాస్ట్ చేయలేదని, ఇది ఆమె చెప్పిన విషయం అంటూ.. ఏకంగా ఓ నేషనల్ న్యూస్ పేపర్లో రాసినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. అయితే, ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. సోషల్ మీడియాలో ఓ ఫేక్ ప్రమోటెడ్ పోస్టు ఈ అవాస్తవ ప్రచారానికి కారణం అయ్యింది. వాస్తవానికి ఆమె పేరుతో ఓ ఫేక్ వెబ్ సైట్ ఈ వార్తను రాసింది. అదీ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోగోతో. ఇది నిజం అనుకుని చాలా మంది సోషల్ మీడియాలో ఆ వార్తను ప్రచారం చేశారు.

- Advertisement -
saipallavi

అయితే, ఆ వార్తలన్నీ కేవలం ఫేక్ ప్రచారాలుగా నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు చూసి మోసపోకూడదని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఫేక్, ప్రమోటెడ్ పోస్టులను క్లిక్ చేయడం ద్వారా బ్యాంక్ పాస్ వర్డ్స్, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సైబర్ నేరస్తుల చేతికి చిక్కే అవకాశం ఉంటుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి ఫేక్ పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. లేదంటే సైబర్ నేరస్తుల వలలో చిక్కి ఉన్నదంతా పోగొట్టుకోవడం పక్కా అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com