Poonam Pandey : జనాలను బకరాలను చేసిన పూనమ్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు

- Advertisement -


Poonam Pandey : బాలీవుడ్ నటి మోడల్ పూనమ్ పాండే ఇటీవల మరణించిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం అభిమానులతో పాటు, స్నేహితులను, కొంతమంది కుటుంబ సభ్యులను కూడా బాధించింది. ఇది నిజమైన వార్త అని చాలామంది నమ్మారు. పూనమ్ సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయిందని ఆమె వ్యక్తిగత సిబ్బంది అధికారికంగా ప్రకటించినప్పటి నుండి నిన్నటి నుండి టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆమె చిన్న వయసులోనే క్యాన్సర్‌తో చనిపోవడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

Poonam Pandey
Poonam Pandey

ఆమె మృతదేహం లభ్యం కాకపోవడం.. అంత్యక్రియల గురించి ఎటువంటి సమాచారం లేదు. కుటుంబ సభ్యులు సైతం దీనిపై స్పందించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పూనమ్ పాండే అందరికీ షాక్ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో పూనమ్ నేను బతికే ఉన్నాను.. నాకు గర్భాశయ క్యాన్సర్ రాలేదు.. దేశంలో ఎంత మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.. సరైన చికిత్సపై అవగాహన లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక ఈ కాన్సర్ పై అవగాహన కల్పిస్తూ తాను చనిపోయినట్లు ప్రచారం చేశానని పూనమ్ పాండే వివరించారు.

ఇదిలా ఉంటే ఆమె అభిమానులు కొందరు ఆమెకు మద్దతుగా మాట్లాడుతుండగా.. మరికొందరు పూనమ్ ని తిట్టిపోస్తున్నారు. అవగాహన కల్పించేందుకు వేరే మార్గం కనిపించలేదా అని తిట్టిపోస్తున్నారు. చనిపోయినట్లు ఇలా ప్రకటన ఇస్తే అభిమానులు ఎంతగా బాధపడతారో నీకు తెలియదా.. అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఒక అడుగు ముందుకేసి ఆమెపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. కేవలం సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కోసం ఇలా చేసింది. అయితే ఇప్పటికే చాలామంది అభిమానులు ఆమె చనిపోయిందని ఎమోషనలై.. నివాళులు సైతం అర్పించారు. ఇదంతా ఫేక్ అని తెలియడంతో ఎంతో హర్ట్ అయ్యారని.. సినీ వర్కర్ అసోసియేషన్ కేసులో వివరించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here