Case Filed On Chinmayi : మరో వివాదంలో సింగర్ చిన్మయి.. సీనియర్ నటిపై సెటైర్లు.. పోలీసు కేసు నమోదు

- Advertisement -

Case Filed On Chinmayi : సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద గురించి తెలియని వారుండరు. స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పడంతో టాలీవుడ్​లో చిన్మయి బాగా పాపులర్ అయిపోయింది. కేవలం పాటలు పాడటం, డబ్బింగ్ చెప్పడమే కాదు చిన్మయి సోషల్ యాక్టివిస్ట్ కూడా. సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న ఆకృత్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూ ఉంటుంది. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్స్ చేస్తే వాటిని స్క్రీన్ షాట్ తీసి అదే సోషల్ మీడియా వేదికగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది.

Case Filed On Chinmayi

ఆడవాళ్ల స్వేచ్ఛ, స్వాతంత్య్రం గురించి నిరంతరం తపించే చిన్మయి చాలాసార్లు తన కామెంట్స్​తో వివాదాల్లో చిక్కుకుంటుంది. తాజాగా ఆమె ఓ సీనియర్ నటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలపైన కామెంట్స్ చేసింది. సీనియర్ నటి మాటలపై సెటర్లు వేసినందుకు నెటిజన్లు చిన్మయిపై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్​పై ఏకంగా కొందరు కేసు పెట్టడంతో ఇది తీవ్ర దుమారం రేపుతోంది. అసలేం జరిగిందంటే?

సీనియర్ నటి అన్నపూర్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆడవాళ్ల స్వేచ్ఛ గురించి మాట్లాడారు. ఆడవాళ్లు అర్ధరాత్రి వరకు బయట తిరగాల్సిన పని ఏముంది? ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్లం ఇప్పుడు ఎలా ఉంటున్నారు? ఈ రోజుల్లో అమ్మాయిలకు ఎక్స్ పోజింగ్ ఎక్కువైంది. ప్రతిసారి ఎదుటివాళ్లదే తప్పు అని అనుకోకూడదు మన వైపు కూడా తప్పు ఉండొచ్చు అంటూ ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలపై తన అభిప్రాయం తెలిపారు.

- Advertisement -

ఈ వీడియో కాస్త చిన్మయి దృష్టిలో పడటంతో తాను అన్నపూర్ణ కామెంట్స్​పై స్పందించింది. అన్నపూర్ణ కామెంట్స్​ను ఖండిస్తూ .. ఆమె చెప్పిన దాని ప్రకారం లేడీ డాక్టర్లు రాత్రి పని చేయకూడదు. అమ్మాయిలకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఉదయం వరకు వెయిట్ చేసి పొద్దున్నే హాస్పిటల్ వెళ్లాలి. వేష ధారణ వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయి అంటున్న వారున్న భారతదేశంలో పుట్టడం మన ఖర్మ అంటూ సెటైర్లు వేయడంతో చిన్మయిపై నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. అన్నపూర్ణ తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పారని, ఆమె కొందరు ఆడవాళ్ల గురించే అన్నారని, అందరినీ కలిపి మాట్లాడలేదంటూ మండిపడుతున్నారు. ఫ్రీడమ్​ను మిస్ యూజ్ చేయొద్దంటూ ఆమె మాట్లాడారని కానీ ఆ విషయాన్ని మార్చి ఓవర్​గా సెటైర్లు వేస్తున్నావంటూ చిన్మయిపై సీరియస్ అవుతున్నారు.

మరోవైపు ఈ వీడియో భారతదేశంలో అమ్మాయిగా పుట్టడం మన ఖర్మ అంటూ చిన్మయి చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఖండించారు. ఈ క్రమంలోనే చిన్మయిపై కేసు పెట్టారు. మహిళలకు మన దేశంలో ఎంతో సముచిత స్థానం ఉన్నా, అయినా దేశాన్ని, మహిళలను కించపరిచే విధంగా చిన్మయి కామెంట్స్ ఉన్నాయని మండిపడ్డారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here