Varun Sandesh : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన హీరో వరుణ్ సందేశ్. ఈయన ‘హ్యాపీ డేస్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన హీరోగా నటించిన ‘కొత్త బంగారు లోకం’ చిత్రం కూడా పెద్ద హిట్ అయ్యింది.
ఈ రెండు సినిమాల తర్వాత ఆయన చాలా చిత్రాలే చేసాడు కానీ, ఒక్కటి కూడా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈయన బిగ్ బాస్ సీజన్ 4 లో తన భార్య రితిక తో కలిసి అడుగుపెట్టాడు. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచాడు. ఈ రియాలిటీ షో ద్వారా ఆయన కోట్లాది మంది తెలుగు ప్రేక్షుకులకు బాగా దగ్గరయ్యాడు కానీ, ఆ తర్వాత తన కెరీర్ ని మాత్రం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోలేకపోయాడు.
ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో వరుణ్ సందేశ్ భార్య రితిక మాత్రం బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘వరుణ్ సందేశ్ తో నాకు పెళ్లి జరిగి 7 ఏళ్ళు అయ్యింది. పెళ్ళై ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా కూడా మీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు అనే ప్రశ్నలు మాకు చాలానే ఎదురు అయ్యాయి. కానీ మేమిద్దరం అమెరికా లో ఉన్నప్పుడు ప్లాన్ చెయ్యకుండానే నేను ప్రెగ్నెంట్ అయ్యాను.
2018 వ సంవత్సరం లో ప్రెగ్నెంట్ అయిన నాకు, కేవలం 40 రోజులకే బేబీ మిస్ క్యారేజ్ అయ్యింది. ఇక అప్పుడు అమెరికా నుండి ఇండియా కి వచ్చేసాము. నేను, నా మానసిక పరిస్థితి కుదుటపడడానికి చాలా సమయమే పట్టింది. ఈసారి అలాంటి కాంప్లికేషన్స్ ఏమి రాకుండా, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే మీ అందరూ శుభవార్త వింటారు’ అంటూ చెప్పుకొచ్చింది రితిక.