‘భోళా శంకర్’ చిత్రానికంటే ‘బిజినెస్ మేన్’ రీ రిలీజ్ కి అత్యధిక గ్రాస్ వసూళ్లు.. ఇది మామూలు అవమానం కాదు!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల దగ్గర పడిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద పండగ వాతావరం వచ్చిన ఫీలింగ్ కలుగుతాది. ఎక్కడ చూసినా బ్యానర్స్, కటౌట్స్ , అభిమానుల కేరింతలు, కేక్ కట్టింగులు వంటివి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం వాటి జోరు బాగా తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్’ ఈ నెల 11 వ తేదీన గ్రాండ్ గా విడుదల అవ్వబోతుంది.

భోళా శంకర్
భోళా శంకర్

ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ గ్రాండ్ గా చేస్తున్నారు. ముఖ్యంగా రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల్లో నింపిన జోష్ సాధారమైనది కాదు. కానీ ఎందుకో ఈ సినిమాపై అభిమానులు ఆసక్తిగా లేరు. మొదటి నుండి ఈ చిత్రం రీమేక్ అని ముద్ర పడిపోవడం వల్లే అలా అనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఈమధ్య కాలం లో రీమేక్ సినిమాలకు ఆదరణ బాగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే.

దానికి తోడు కెరీర్ లో ఒక్క సక్సెస్ కూడా లేని మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు అవ్వడం, ఈ చిత్రం పై ఆశించిన స్థాయి హైప్ క్రియేట్ అవ్వలేకపోయిందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి. బుకింగ్స్ ట్రెండ్ ఆశించిన స్థాయిలో లేవు , ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే చాలా వీక్ గా ఉన్నాయి.

- Advertisement -

చిరంజీవి రేంజ్ లో సగం కూడా లేవు, ఆయన గత చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టగా, భోళా శంకర్ చిత్రం ఇప్పటి వరకు కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా దాటలేదు. ఇక రేపు విడుదల అవ్వబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బిజినెస్ మేన్‘ చిత్రానికి కేవలం హైదరాబాద్ బుకింగ్స్ ద్వారా కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. ఒక రీ రిలీజ్ సినిమా, కొత్తగా విడుదల అవ్వబోతున్న స్టార్ హీరో సినిమాని డామినేట్ చేస్తుంది అంటే , రీమేక్స్ కి డేంజర్ బెల్స్ మోగినట్టే, చిరంజీవి ఇకనైనా రీమేక్స్ ఆపాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here