Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు ప్రేక్షకులతో పాటుగా ప్రేక్షకుల్ని కూడా వెయిట్ చేసేలా చేస్తున్నారు. పుష్ప టు సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. పుష్ప పార్ట్ వన్ ఊహించని స్థాయిలో సెన్సేషన్ హిట్ అయింది. రెండో భాగం మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నారు దానికి తోడు పుష్ప టు సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్లు మూవీ మీద అంచనాలను ఇంకా పెంచేసాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అంచనాలను ఇంకాస్త పెంచింది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో జాతర సెటప్ తో సాగిన విజువల్స్ వావ్ అనిపించాయి.

గంగమ్మ అవతారంలో అల్లు అర్జున్ లుక్ అదిరి పోయింది. తన మేనేరిజం తో దులిపేసాడు అల్లు అర్జున్. ఈ సినిమా మీద అభిమానులు అంచనాలని ఇంకాస్త పెంచుకున్నారు భారతీయ సినిమా పరిశ్రమలో మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప టు అనే మాట ప్రస్తుతం అన్ని చోట్ల వినపడుతూనే ఉంది పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన పుష్పా ది రూల్ బిజినెస్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఆడియో డిజిటల్ రైట్స్ రిలీజ్ కి సంబంధించి హక్కులు హాట్ కేకుల అమ్ముడయ్యాయి నైజాం హక్కుల అమ్మకం వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రికార్డ్ ధర కి పుష్ప టు సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. నైజాం కి చెందిన డిస్టిబ్యూటర్ మూవీ హక్కులని సొంతం చేసుకున్నారు. మూవీ హక్కుల సుమారుగా 100 కోట్ల మేర అమ్ముడైపోయాయి అని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. నైజం థియేటర్కల్ బిజినెస్ విషయంలో ఆర్ఆర్ఆర్ మూవీ ని క్రియేట్ చేసిన రికార్డుని తుడిపేసింది రాజమౌళి సినిమా బిజినెస్ 100 కోట్ల కంటే తక్కువ జరిగింది.