పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసలు కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమా, పైగా టాక్ లేదు, ఈ సినిమా మూడు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడడమే కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా మొదటి మూడు రోజులు ఈ సినిమాకి అద్భుతమైన వసూళ్లు వచ్చాయి.

ఒక సూపర్ హిట్ సినిమాకి ఏ రేంజ్ వసూళ్లు అయితే వస్తాయో, అలాంటి వసూళ్లు ఈ సినిమాకి వచ్చాయి. ఇక ఆ తర్వాత నాల్గవ రోజు నుండి భారీ డ్రాప్స్ సొంతం చేసుకున్నప్పటికీ కూడా, అదే స్థాయి డీసెంట్ రన్ ని చివరి వరకు కొనసాగిస్తూ వెళ్ళింది ఈ చిత్రం. ఫలితంగా క్లోసింగ్ లో 70 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. ముందుగా నైజం ప్రాంతం విషయానికి వస్తే ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ చిత్రానికి ఇక్కడ 22 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 25 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాలి, కానీ అది జరగలేదు, ఫలితంగా రెండు కోట్ల రూపాయిల నష్టాలు వాటిల్లింది.

అలాగే సీడెడ్ లో 7 కోట్ల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 7 కోట్ల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 కోట్ల 90 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 4 కోట్ల 40 లక్షల రూపాయిలు,గుంటూరు లో 4 కోట్ల 55 లక్షల రూపాయిలు, కృష్ణ లో 3 కోట్ల 60 లక్షల రూపాయిలు , నెల్లూరు లో కోటి 80 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో 7 కోట్ల 30 లక్షలు, అలాగే కర్ణాటక లో 6 కోట్ల 25 లక్షలు మొత్తం మీదుగా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది.బ్రో ది అవతార్