ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం. ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ టాక్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి మొదటి మూడు రోజులు అద్భుతమైన ఓపెనింగ్స్ రప్పించేలా చేసాడు. ఇక వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి పెద్ద వసూళ్లు రావని అనుకున్నారు కానీ, పవర్ స్టార్ మ్యాజిక్ పని చేసింది.

సోమవారం నుండి నేటి వరకు ఈ చిత్రానికి షేర్ వసూళ్లు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మరియు మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాలు విడుదల అయ్యాయి. అయినా కూడా ‘బ్రో ది అవతార్’ వసూళ్లు ఆగలేదు. ఇప్పటికే 16 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

ఈ 16 రోజుల్లో ఈ సినిమాకి 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్ల రూపాయలకు జరిగింది అని అనుకుంటున్నారు కానీ, వాస్తవానికి ఈ చిత్రానికి జరిగిన బిజినెస్ మొత్తం అడ్వాన్స్ బేసిస్ మీద అట. ఆ విధంగా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగిందని, ఆ విధంగా చూసుకుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కు ఈరోజు తో అందుకుందని అంటున్నారు.

మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి నిన్న కొన్ని ప్రాంతాలలో మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘భోళా శంకర్‘ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయట. ఇక వీకెండ్ లో ఎక్కువ వసూళ్లు వచ్చే సూచనలు ఉండడం తో ఈ సినిమాకి థియేటర్స్ కూడా అదనంగా యాడ్ చేశారట. ఆగష్టు 15 వ తారీఖు వరకు ఈ సినిమాకి షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.
