Bro Movie Review : కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, సాయి ధరమ్ తేజ్ , కేతిక శర్మ హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమాకి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. టీజర్,ట్రైలర్ తో విడుదలకు ముందే అల్ట్రా పాజిటివ్ వైబ్ ని ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా, విడుదల తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుందో లేదో చూద్దాం.

కథ :
ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబమే లోకంగా బ్రతికే వ్యక్తి మార్కండేయ( సాయి ధరమ్ తేజ్). ప్రతీ ఒక్కటి చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటాడు, కానీ అనుకోకుండా అతను రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతాడు. అతని ఆత్మ ఒక అంధకారం లోకి వెళ్లిన తర్వాత ఒక వెలుగు ద్వారా టైం గాడ్ (పవన్ కళ్యాణ్) వస్తాడు. నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, కొన్ని రోజులు బ్రతికే ఛాన్స్ ఇవ్వు, అవి తీర్చుకొని వచ్చేస్తాను అంటాడు. టైం గాడ్ అతనికి 90 రోజుల సమయం ఇస్తాడు. ఈ నెలరోజుల్లో అతను తన బాధ్యతలు మొత్తం నెరవేర్చుకున్నాడా లేదా..? అనేదే మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
పవన్ కళ్యాణ్ ఎనర్జీ తో కనిపిస్తే ప్రతీ ఒక్కరికీ చాలా ఇష్టం. ఆయనని అలా వెండితెర మీద చూస్తే కేవలం అభిమానులకు మాత్రమే కాదు , ఆడియన్స్ కి కూడా కనులపండుగ లాగా ఉంటుంది. ఆయన పాత సినిమాలను నచ్చని వాళ్లంటూ ఎవరూ ఉండరు. అవి రీ రిలీజ్ అయ్యినప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ ని సృష్టించాయి అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి ఎనెర్జిటిక్ పవన్ కళ్యాణ్ ని చూస్తామా అని అనుకునే అభిమానులకు ‘బ్రో ది అవతార్’ చిత్రం ఒక కనుల పండుగా లాంటి సినిమా. పవన్ కళ్యాణ్ ఎంట్రీ దగ్గర నుండి చివరి వరకు అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపొయ్యెలా తీసాడు డైరెక్టర్ సముద్ర ఖని. ప్రారంభం నుండే కథలోకి వెళ్లి మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ముందుకు సాగిపోతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అదిరిపోయింది, ఇంటర్వెల్ లో పవన్ కళ్యాణ్ దేవుడి అవతారం లో చూపించిన విధానం ఫ్యాన్స్ కి నరాలు కట్ అయిపోతాయి.
ఇకపోతే సెకండ్ హాఫ్ ప్రారంభం చాలా స్లో గా ఉంటుంది కానీ , ఆ తర్వాత పికప్ అయ్యి మంచి ఎంగేజింగ్ తో ముందుకు దూసుకెళ్తుంది. చివరి 30 నిముషాలు సినిమాకి హైలైట్. కానీ ఈ సినిమాకి సాయి ధరమ్ తేజ్ పెద్ద మైనస్ అయ్యాడు. ఆయన నటించేటప్పుడు ఎంతో ఇబ్బంది పడుతున్నట్టుగా అర్థం అవుతుంది. ఆయన స్థానం లో నితిన్ కానీ , రామ్ కానీ చేసి ఉంటె బాగుండేది అని అనిపించింది. మరో మైనస్ ఏమిటంటే ఈ సినిమాలో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ పాత పాటలను పెట్టడమే, ఒకటి రెండు సన్నివేశాలు అంటే ఓకే కానీ, సినిమా మొత్తం అదే ఉంటె కాస్త చూసే ప్రేక్షకుడికి వెగటు వేస్తుంది. ఈ చిత్రం విషయం లోను అదే జరిగింది. థమన్ అందించిన పాటలు పెద్దగా పేలకపోయిన, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా కొట్టాడు.
చివరి మాట :
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం పండుగ లాంటి సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచొచ్చు, సినిమా రేంజ్ ఏమిటి అనేది వాళ్ళ చేతిలోనే ఉంది.
రేటింగ్ : 2.75 /5