Bro Movie అటు రాజకీయాలు ఇటు సినిమాలు వరుసగా చేస్తూ బిజీగా ఉన్న స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎటువంటి హడావిడి లేకుండా రిలీజ్ కు సిద్ధమైన “బ్రో ది అవతార్” మూవీ కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ నటిస్తున్న ఈ సాలిడ్ చిత్రాన్ని సముద్రఖని డైరెక్టర్ త్రివిక్రమ్ దిశా నిర్దేశంతో తెరకెక్కించడం జరిగింది.

ఈనెల 25వ తారీకున హైదరాబాద్లో ఈ మూవీకి సంబంధించి గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నారు. ఇప్పటివరకు చిత్రం నుంచి విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మూవీపై అంచనాలను కూడా బాగా పెంచాయి. ఈరోజు ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ఓవరాల్ గా U సర్టిఫికెట్ ఇచ్చారు.
జూలై 28న గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ‘బ్రో ది అవతార్’మూవీ విడుదల కాబోతోంది. ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సందర్భంగా డైరెక్టర్ సముద్రఖని పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అయింది. సెన్సార్ యూనిట్ కి బ్రో సినిమా చూపించడం జరిగిందని…మా బ్రో టైం బాగుంది అన్నట్లుగా ఆయన ఆ పోస్టులు తెలిపారు. సెన్సార్ బోర్డు కూడా బ్రో సినిమా ను ఓ రేంజ్ లో మెచ్చుకున్నట్లు తెలుస్తుంది.
పవన్ నుంచి మంచి మూవీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్న అతని ఫాన్స్ అందరు ఈ చిత్రం కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. రీసెంట్ గా రీ రిలీజ్ అయిన పవన్ గోల్డెన్ హిట్ తొలిప్రేమ మూవీ కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఇది పవన్ ఫ్యాన్స్ కు అతని మీద ఉన్న అభిమానానికి నిదర్శనం.ఈ నేపథ్యంలో బ్రో చిత్రాన్ని ఏ రేంజ్ లో ప్రేక్షకులు ఆదరిస్తారో ఆలోచించండి. పైగా ఈ చిత్రంలో క్లైమాక్స్ లో పవన్ ఇచ్చే ఎమోషనల్ సందేశం ఎక్స్లెంట్ గా ఉంది అని అంటున్నారు.