Das Ka Dhamki : సంక్రాంతి సినిమాలు విడుదలై వెళ్లిపోయిన తర్వాత మన టాలీవుడ్ లో సరైన బ్లాక్ బస్టర్ పడలేదు.రీసెంట్ గా విడుదలైన ‘బలగం’ చిత్రం ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపొయ్యే వసూళ్లను రాబడుతున్నప్పటికీ, అది కేవలం తెలంగాణ ప్రాంతం కి మాత్రమే పరిమితం అయ్యింది.మొత్తం ప్రపంచవ్యాప్తంగా దుమ్ములేపే వసూళ్లను రాబట్టిన సినిమా లేదు.అలాంటి సమయం లో లేటెస్ట్ గా విడుదలైన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి.

మొదటి ఆట నుండే సరైన టాక్ లేదు, సోషల్ మీడియా లో ఉన్న వెబ్ సైట్స్ అన్నీ ఈ చిత్రానికి వరస్ట్ రేటింగ్స్ ఇచ్చాయి.అయినా కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి, అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 5 కోట్ల రూపాయిలు షేర్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు.విశ్వక్ సేన్ గత చిత్రాల క్లోసింగ్ కలెక్షన్స్ కూడా ఇంత లేవు.

కమర్షియల్ సినిమా కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ బాగా వస్తాయని ఊహించిందే, కానీ ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి రివ్యూస్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ఓపెనింగ్ రావడం అందరినీ షాక్ కి గురి చేసింది.అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కేవలం USA నుండే లక్షా 50 వేల డాలర్లు వచ్చాయి.విశ్వక్ సేన్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ ఇది.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయలకు జరిగిందని, మొదటి రోజే 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి బ్రేక్ ఈవెన్ కి చాలా చెరువుకి వచ్చిందని, ఈరోజుతో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టబోతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.విశ్వక్ సేన్ కి నిర్మాతగా కూడా ఈ చిత్రం భారీ లాభాల్ని తెచ్చిపెట్టిందని,ఈ సినిమా నుండి ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు.ఓపెనింగ్స్ అయితే అదిరిపోయాయి కానీ ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.
