Brahmanandam : మన తెలుగు ప్రేక్షకులు ఇతను మా వాడు అని గర్వంగా చెప్పుకునే నటులలో ఒకడు బ్రహ్మానందం. మెగాస్టార్ చిరంజీవి మరియు జంధ్యాల ప్రోత్సాహం తో ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన బ్రహ్మానందం హాస్య బ్రహ్మ గా పేరు తెచ్చుకున్నాడు. ఎవరైనా కామెడీ చేస్తే నవ్వు రావొచ్చేమో కానీ, బ్రహ్మానందం ముఖం చూస్తేనే నవ్వు వచ్చేస్తాది. అలాంటి హాస్య నటులు భారతదేశం మొత్తం వెతికినా కనిపించరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అందుకే వెయ్యికి పైగా సినిమాల్లో నటించాడు. అందుకు ఆయన పేరు ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించారు. ఒకానొక దశలో బ్రహ్మానందం ఏడాదికి 20 నుండి 30 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన లేని శుక్రవారం సినిమాలు లేవు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఈమధ్య బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, డాక్టర్ల సలహా మేరకు సినిమాల సంఖ్య బాగా తగ్గించేసాడు.
అయితే బ్రహ్మానందం ఆస్తుల గురించి ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు బ్రహ్మానందం దాదాపుగా 500 కోట్ల రూపాయిల వరకు సంపాదించాడని తెలుస్తుంది. ఒక్కో సినిమాకి ఆయన కోటి నుండి రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే వచ్చిన ప్రతీ పైసా ని జాగ్రత్తగా పొదుపులు చేస్తూ, భూములను కొనుగోలు చేసేవాడు. అలా ఆయన హైదరాబాద్ లో ఆస్తులు కూడగట్టాడు.

ఇదంతా పక్కన పెడితే బ్రహ్మానందం వారం రోజులు, పది రోజులు పనిచేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆయన ఒక్క రోజు కాల్ షీట్ ఇస్తే 20 లక్షల రూపాయిలు ఇస్తారట. అలా ఆయన దూకుడు సినిమా తర్వాత ఒక ఏడాది లో 40 సినిమాలు చేసాడు. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చి ఉంటారో ఊహించుకోండి. విలువైన భూములతో పాటు, మార్కెట్ లో వచ్చిన కొత్త బ్రాండెడ్ కార్లు కూడా ఉన్నాయి ఆయనకీ. అలా ఆయన ఆస్తులు మొత్తం కలుపుకుంటే 500 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఇంత మొత్తం ఆస్తులు కొంతమంది స్టార్ హీరోలకు కూడా లేదు.