Boyapati Srinu : టాలీవుడ్ లో మాస్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు డైరెక్టర్ బోయపాటి శ్రీను. దాదాపు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కెరీర్లో మాత్రం ఇప్పటి వరకు ఆయన తీసినవి దాదాపు 10సినిమాలు మాత్రమే. అందులో బాలయ్య బాబుతోనే మూడు సినిమాలు తీశారు. అవుట్ అండ్ యాక్షన్లో బాలయ్యను హీరోగా చూపించి సక్సెస్ కొట్టారు. బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. బాలయ్యాతో ఫర్వాలేదనిపించినప్పటికీ.. ఆయన ఇతర హీరోలతో చేస్తే బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తో తెరకెక్కించిన సరైనోడు, రవితేజతో భద్ర సినిమాలు తప్ప మరేవీ బోయపాటి కెరియర్లో సక్సెస్ అందుకోలేకపోయాయి.
హీరోగా బాలయ్య ఉంటేనే డైరెక్టర్గా బోయపాటి ఉంటే ఏం చేసినా నడుస్తుందన్న టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా ఎంతటి డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా రామ్ తో బోయపాటి తీసిన స్కంద సినిమా ఫలితం కూడా దాదాపు అలాగే ఉందని తెలుస్తోంది. కానీ శ్రీలీలే సినిమాకు బలంలా అనిపిస్తోందన్న కామెంట్స్ వస్తున్నాయి.
కేవలం ఆమె కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం చిత్ర బృందం పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసింది. వైలెన్స్ ఎక్కువగా ఉండడం, రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం జనాలకు నచ్చడం లేదు. ఎప్పుడు రాజకీయ నాయకులని టార్గెట్ చేస్తూ సినిమాలను తీస్తే.. బోయపాటికి ఇక మీదట రాబోయే రోజుల్లో అవకాశాలు ఉండవంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.