Boney Kapoor : తన తల్లి చితికి నిప్పంటించిన శ్రీదేవి.. మా ఆవిడకు మతవిశ్వాసాలు ఎక్కువన్న బోనీకపూర్

- Advertisement -

Boney Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ టు బాలీవుడ్ ఆమె ఓ సూపర్ స్టార్. ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే శ్రీదేవి ఒక్కసారిగా వారిందరికీ వీడ్కోలు పలికింది. ఈరోజుకు కూడా ఆమెను స్మరించుకుంటే అభిమానుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. దివంగత నటి కుటుంబ సభ్యులు కూడా ఆమెను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతుంటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ తన దివంగత భార్య శ్రీదేవి గురించి మాట్లాడాడు. ఆమెకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించాడు.

Sridevi Boney Kapoor
Sridevi Boney Kapoor

ప్రస్తుతం బోనీ కపూర్ తన మైదాన్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన జూమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్ శ్రీదేవి ఆధ్యాత్మిక ధోరణి, ఆమె కుటుంబంతో సహా అనేక విషయాల గురించి మాట్లాడారు. బోనీ కపూర్, శ్రీదేవి ఆధ్యాత్మికత గురించి వెల్లడిస్తూ ఆమెకు ఎక్కువ మత విశ్వాసాలు ఉన్నాయని.. ఆమె కారణంగా తను వాటిని నమ్మడం ప్రారంభించాడని చెప్పాడు. మొదట్లో విశ్వాసాలలో విభేదాలు ఉన్నప్పటికీ, కపూర్ శ్రీదేవి ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడయ్యాడు. అది వారి బంధాన్ని మరింతగా బలపరిచిందని తెలిపాడు.

sridevi janhvi kapoor

- Advertisement -

సంభాషణలో బోనీ శ్రీదేవి అసాధారణ స్వభావం గురించి కూడా మాట్లాడాడు. శ్రీదేవి అసాధారణమైన పాత్రలు, అసాధారణమైన పనులను చేసింది. తన తల్లి మరణించినప్పుడు అన్నీ తానై దగ్గరుండి అంత్యక్రియలు జరిపించింది. తానే తన తల్లి చితికి నిప్పంటించింది. సాంప్రదాయకంగా చితి వెలిగించడం పురుషుల పాత్ర అని బోనీ వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె కుమార్తె జాన్వీ కపూర్‌కు కూడా మతపరమైన విశ్వాసాలపై నమ్మకం ఎక్కువ. తను తరచూ తిరుపతి బాలాజీ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటుంది. ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా ఆలయానికి 50వ సందర్శనను పూర్తి చేసుకున్నారు. 2018లో కుటుంబ వివాహానికి హాజరైన శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్‌లోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here