Anshula Kapoor : అతిలక సుందరి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఇద్దరు భామలు హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే తమ హాట్ ఫోటోషూట్‌లతో సెలబ్రిటీలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తాను ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా ‘ది ఆర్చీస్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోంది.
ఇద్దరి కెరీర్లను తండ్రి బోనీ కపూర్ చక్కగా రూపొందిస్తున్నాడు. కూతుళ్లు కోట్ల రూపాయలు సంపాదిస్తుండడంతో బోనీ కపూర్ ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇప్పుడు శ్రీదేవి వారసురాళ్లు ఖుషీ, జాన్వీలు అందంగా ఉన్నారా లేక బోనీకపూర్ మాజీ భార్యకు పుట్టిన అన్షులా కపూర్ అందంగా ఉన్నారా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దానికి కారణం కూడా ఉంది. తాజాగా అన్షులా కపూర్ అందంగా కనిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ ఫొటోలో అన్షులా చాలా అందంగా కనిపించింది.
నిజానికి జాన్వీ, ఖుషీ నిరంతరం జిమ్‌లో వర్కవుట్ చేస్తూ అల్ట్రా స్లిమ్‌గా కనిపిస్తున్నప్పటికీ, అన్షులా మాత్రం ఇద్దరికీ భిన్నంగా కాస్త బొద్దుగా కనిపిస్తుంది. కానీ చాలా అందంగా ఉంది. తన ముఖంలో ఏదో తెలియని స్పెషాలిటీ ఉందంటున్నారు నెటిజన్లు. శ్రీదేవిని చూసిన కళ్లతో జాన్వీ, ఖుషీని అభిమానులు అంగీకరించలేకపోయారు. ఆమె అందం ఎవరికీ రాలేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు బోనీ కపూర్ మాజీ భార్య కూతురు అన్షులా కపూర్ – ఖుషీ కపూర్ ఒకే ఫ్రేమ్‌లో కలిసి కనిపించారు. అన్షులా కపూర్ ముందు ఖుషీ కపూర్ అందం బోసిపోయింది.
బోనీ కూతురు అందం ముందు అతిలోక సుందరి శ్రీదేవి కూతుళ్లు బలాదూర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అన్షులా కపూర్ తల్లి 2012లో క్యాన్సర్‌తో మరణించింది. అది ఆమె మనసులో చెరగని ముద్ర వేసింది. అన్షులా 14 ఏళ్ల నుంచి పీసీఓఎస్ (Polycystic ovary syndrome)తో బాధపడుతోంది. అయితే తాజాగా ఇటీవల తాను బ్యూటిఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఆమె ఫిట్‌నెస్, బాడీ పాజిటివిటీ గురించి వేదికపై మాట్లాడింది. అన్షు ఆన్‌లైన్ సెలబ్రిటీ ఫండ్ రైజర్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్యాన్ కైండ్ అనే ఛారిటీ ఫౌండేషన్‌ను కూడా నడుపుతున్నారు. ఆమె మాట్లాడిన ప్రతిసారీ మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తూనే ఉంటారు.