Varjun Dhawan : తండ్రి కాబోతున్న యంగ్ హీరో వరుణ్ ధావన్..!

- Advertisement -

బీ-టౌన్‌లో వరుసగా గుడ్‌న్యూస్‌ వినిపిస్తున్నాయి. కొందరు తారలు తమ రిలేషన్‌షిప్‌ గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటే మరికొందరి పెళ్లి గురించి రూమర్స్ వస్తున్నాయి. ఇంకోవైపు పెళ్లైన జంటలు తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ తీపికబురు చెబుతున్నారు. అలా ఇటీవల బాలీవుడ్‌లో వరసుగా టాప్ స్టార్లు గుడ్‌న్యూస్ చెప్పారు.. తమ ఇంటికి ఓ బుజ్జాయిని ఆహ్వానించారు. వారిలో ప్రియాంక-నిక్, సోనమ్-ఆనంద్, రణ్‌బీర్-ఆలియా, బిపాసా బసు-కరణ్ జంటలు తమకు పిల్లలు పుట్టిన వార్తలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో మరో బాలీవుడ్ యంగ్ హీరో చేరినట్లు తెలుస్తోంది.

మరో బాలీవుడ్ యంగ్ హీరో తండ్రి కాబోతున్నాడని స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హింట్ ఇచ్చారు. యంగ్ హీరో వరుణ్ ధావన్ తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆ జంట డైరెక్ట్‌గా ప్రకటించలేదు. కానీ బీ టౌన్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు. రీసెంట్‌గా వరుణ్ ధావన్ తన సినిమా ప్రమోషన్ కోసం హిందీ బిగ్‌బాస్ షోకు వెళ్లగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

భేడియా మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు వరుణ్ ధావన్-కృతి సనన్ జంట. ఇందులో భాగంగానే వరుణ్ ధావన్.. కృతి సనన్‌తో కలిసి హిందీ బిగ్‌బాస్ షోకు వెళ్లాడు. అక్కడ సల్లూ భాయ్ ఈ ఇద్దరితో కలిసి సరదాగా గడిపారు. కాసేపు వీరితో గేమ్స్ కూడా ఆడించారు. ఓ బొమ్మను వరుణ్ చేతిలో పెట్టిన సల్మాన్‌.. ఇన్‌డైరెక్ట్‌గా కొన్నివాఖ్యలు చేశారు. బొమ్మను చేతిలో పెట్టిన సల్మాన్.. వరుణ్‌తో ఈ బొమ్మ నీ పిల్లాడికోసమే.. అంటూ చెప్పారు. సల్మాన్ మాటలతో సిగ్గుపడిన వరుణ్.. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు అన్నాడు.

- Advertisement -
Varjun Dhawan Natasha
Varjun Dhawan Natasha

‘ఈ బొమ్మను ఇంటికి తీసుకెళ్లు త్వరలో నీ ఇంటికి ఓ బాబో.. పాపో వస్తుంది’ అని సల్మాన్ సరదాగా అన్నాడు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. వరుణ్ తండ్రి కాబోతున్నాడంటూ మాట్లాడుకుంటున్నారు. సల్మాన్ సరదాగా చేసిన వ్యాఖ్య సోషల్ మీడియాలో మాత్రం మామూలు రచ్చ చేయడం లేదు.

వరుణ్ ధావన్.. తన చిన్ననాటి స్నేహితురాలు, డిజైనర్ నటాషా దలాల్‌ను 2021 జనవరి 24న పెళ్లి చేసుకున్నారు. అలీబాగ్​లోని మాన్సస్ హౌస్ రిసార్ట్​లో జరిగిన ఈ వేడుకలో ప్రేయసి నటాషా దలాల్​కు మూడు ముళ్లు వేశారు. ఇరుకుటుంబాలతో పాటు సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఫొటోలను ఇన్​స్టాలో పంచుకున్నారు వరుణ్.

సల్మాన్ ఖాన్ తాను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో చాలా సందడిగా ఉంటారు. ఇక కంటెస్టెంట్లతో సల్మాన్ చాలా సరదాగా మాట్లాడతారు. షోకి వచ్చే గెస్టులతో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అప్పుడప్పుడు వాళ్లని ఆటపట్టిస్తుంటారు కూడా. కేవలం వరుణ్‌కే కాదు సల్మాన్ సిద్ధార్థ్ మల్హోత్రాకు సంబంధించిన ఓ గుడ్‌న్యూస్ కూడా హింట్ ఇచ్చారు. థాంక్ గాడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ షోకి వచ్చిన సిద్ధార్థ్‌ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావు అంటూ హింట్ ఇచ్చాడు. సిద్ధార్థ్-కియారా అడ్వాణీ వచ్చే జనవరిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ఇలా బాలీవుడ్ స్టార్స్‌కు సంబంధించిన విషయాలను తన షో ద్వారా అనౌన్స్ చేస్తూ హడావుడి చేస్తున్నారు సల్మాన్ ఖాన్. వరుణ్ విషయంలో కూడా సల్మాన్ ఖాన్ చెప్పింది జోక్ కాదని.. నిజంగా వరుణ్ తండ్రి కాబోతున్నట్టు తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com