Kajol : బాలీవుడ్ నటి కాజోల్ తొలిసారిగా హద్దులు దాటింది. యాక్టింగ్ కెరీర్ లో తాను పెట్టుకున్న నో కిస్ పాలసీని 29 ఏళ్ల తరువాత తొలిసారిగా బ్రేక్ చేసింది. అంతేకాదు.. కాజోల్ నటించిన హాట్ కిస్ సీన్స్ కుర్రకారులో సెగలు పుట్టిస్తున్నాయి. తాజాగా రిలీజైన ది ట్రయల్ వెబ్ సిరీస్ లో కాజోల్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లో కాజోల్ తన సహనటులు అల్లీ ఖాన్, జిషు సేన్ గుప్తాలతో వేర్వేరు సన్నివేశాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించింది. ఆ లిప్ లాక్ సీన్స్ కూడా చాలా ఘాటుగా ఉన్నాయి.

కాజోల్ అంటే డీసెన్సీకి పెట్టింది పేరు. బాలీవుడ్‌లో ఆమె హీరోయిన్‌గా చేసే రోజుల్లోనే తన చుట్టూ ఎంత పోటీ ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం ఎప్పుడూ హద్దులు దాటలేదు. అప్పట్లో ఒకట్రెండు సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించినప్పటికీ.. చాలామంది మిగతా హీరోయిన్ల తరహాలో మితిమీరి ఎక్స్‌పోజింగ్ సన్నివేశాల్లో కానీ లేదా ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో కానీ నటించలేదు.

అంతేకాకుండా ఆమె నో కిస్ పాలసీ పెట్టుకుని 29 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తరువాత తనే పెట్టుకున్న రూల్‌ని తనే బ్రేక్ చేసింది. కాజోల్ ఎంచుకునే పాత్రలు సైతం అంతే అందంగా, హృద్యంగా ఉండేవి. కాజోల్‌ని ఎక్కువగా డీసెంట్ పాత్రల్లోనే చూసిన ఆమె అభిమానులు ఇప్పుడిలా ఉన్నట్టుండి ముద్దు సీన్లలో చూసేసరికి తట్టుకోలేకపోతున్నారు. రియాక్ట్ అవకుండా ఉండలేకపోతున్నారు.