Laila : బాలీవుడ్ హీరోయిన్ లైలా ఖాన్ కుటుంబం దారుణ హత్య సంఘటన 2011లో ఇండస్ట్రీలో సంచలం సృష్టించింది. గత పదేళ్లుగా ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా ఈ కేసుపై తుది తీర్పును వెలువరించింది. ముంబై సెషన్స్ కోర్టు నిందితుడిగా తేలిన ఆమె తండ్రికి మరణ శిక్ష విధించింది. నిందితుడు లైలా ఖాన్ తోపాటు తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసి దారుణంగా హాత్య చేశాడు. ఈ కేసు అప్పట్లో భారతీయ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ కేసులో దాదాపు 13ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం ఈ సామూహిక హత్యలకు కారణం ఆస్తి తగాదాలే అని.. ఈ కేసులో ఆమె సవతి తండ్రిని దోషిగా తేల్చి.. ఆయనకు మరణశిక్షన కోర్టు ఖరారు చేసింది.
అసలు వివరాల్లోకి వెళితే.. నటనపై ఆసక్తితో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది లైలా ఖాన్. రాజేష్ ఖన్నా సరసన ‘వాఫా: ఎ డెడ్లీ’ సినిమాతో పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటించింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తరుణంలో 2011లో తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లింది. ఆ తర్వాత లైలా ఖాన్ కుటుంబం కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. చాలా కాలంపాటు వారిని వెతికి చివరకు ఆమె సవతి తండ్రి పర్వేజ్ తక్ పై అనుమానపడ్డారు. అతడిని అరెస్ట్ చేసి విచారించగా నిజాలను ఒప్పుకున్నాడు. లైలా ఖాన్ తోపాటు ఆమె కుటుంబాన్ని హత్య చేసినట్లు అంగీకరించాడు. 2011సంవత్సరంలో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్ పురిలో ఈ ఘటన జరిగింది.
లైలా ఖాన్ తోపాటు ఆమె తల్లి షెలీనా, కజిన్స్ అజ్మీనా, జారా, ఇమ్రాన్, రేష్మాను కిరాతకంగా కాల్చి చంపాడు. శవాలను వారి బంగ్లాలోనే పాతిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన జరిగిన తొమ్మిది నెలలకు ఆమె సవతి తండ్రి పర్వేజ్ తక్ ను జమ్మూ కశ్మీర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి వివాదాల కారణంగానే లైలా ఖాన్ కుటుంబాన్ని హతమార్చినట్లు విచారణలో వెల్లడైంది. సుధీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో దోషిగా తేలిన లైలా ఖాన్ సవతి తండ్రికి తాజాగా ముంబై సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది.