Ashu Reddy : సాగర తీరాన చిల్ అవుతున్న బోల్డ్ బ్యూటీ అషూ రెడ్డి.. క్యూట్ నెస్ ఓవర్లోడెడ్ అంటూ నెటిజన్ల కామెంట్స్

- Advertisement -

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి సోషల్ మీడియాలో ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ భామ ప్రతి రోజు తన ప్రొఫెషనల్ పర్సనల్ విషయాలను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజా గా ఈ భామ ఓ వీడియోను షేర్ చేసింది. అంతే.. క్షణాల్లోనే అది నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో అషు బ్లూ కలర్ డెనిమ్ షార్ట్స్.. ఆరంజ్ కలర్ క్రాప్ టాప్ లో కన్పించింది. సాగర తీరాన ఈ భామ ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియోలో కన్పించింది. ఈ వీడియోలో అశూ చాలా అందంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన కుర్రాళ్ళు ఈ బ్యూటీ అందానికి ఫిదా అవుతున్నారు. నా మనసుకేమైంది.. నీ మాయలో పడింది అని పాట పాడుకుంటున్నారు. సింపుల్ ఔట్ ఫిట్ లోనూ అషు అందంగా కనిపిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో.. ఆషు ఇలా క్యూట్ గా కనిపించి చాలా రోజులు అవుతోందని.. ఈ మధ్య ఎక్కువగా బోల్డ్ ఔట్ ఫిట్స్ లోనే కనిపిస్తోందని.. ఇపుడు ఇలా క్యూట్ గా కన్పించడం చూస్తుంటే బిగ్ బాస్ లో తను ఉన్న రోజులు గుర్తొస్తున్నాయి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అషు కెరీర్ సంగతికి వస్తే.. ఈ భామ డబ్ స్మాష్ లతో సోషల్ మీడియాలో తన హవా స్టార్ట్ చేసింది. మొదట్లో ఈ బ్యూటీ నీ చూసి అందరూ.. జూనియర్ సమంత అనేవాళ్ళు. ఆ తర్వాత ఈ భామ కాస్త లావు కావడంతో కొంత కాలం ఫేడ్ అవుట్ అయింది. మళ్ళీ బిగ్ బాస్ లో సందడి చేసి కమ్ బ్యాక్ ఇచ్చింది. బిగ్ బాస్ లో ఈ భామ కొన్ని వారాలే ఉన్నా.. ఆశూ అందానికి.. క్యూట్ నేస్ కి అప్పట్లో జనం ఫిదా అయ్యారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బుల్లి తెర పై అడపాదడపా షోస్ లో కన్పించింది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడింది. అంతే అలా RGV సావాసంలో రెండు మూడు ఇంటర్వ్యూలు చేసి బిగ్ బాస్ బ్యూటీ కాస్త బోల్డ్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. ఇటీవలే ఓ బోల్డ్ సినిమాలో నటించింది కానీ అంతగా ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేక పోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here