Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట న్యూస్ యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టి.. కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకుంది. తర్వాత వెండి తెరపై ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నటిగా వరుస ఆఫర్లను అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతుంది. నటనతో తన సత్తా చాటి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. పాజిటివ్, నెగిటివ్, బోల్డ్ ఇలా వచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ పోతుంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు హాట్ ట్రీట్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. ఈ గ్లామర్ ఫోటోస్ వైరల్ అయినప్పుడల్లా ఆమెపై నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ క్రమంలో ఆమెకు వచ్చిన నెగటివ్ కామెంట్స్ పై రియాక్ట్ అవ్వడంతో వివాదాలు మరింతగా ముదురుతుంటాయి.
అలా బోల్డ్ యాంకర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా కాంట్రవర్షియల్ బ్యూటీ అనే ముద్ర కూడా వేసుకుంది. కానీ ఈ కామెంట్స్ ఏవి పట్టించుకోకుండా తన పని తానే చూసుకుంటూ ముందుకు వెళుతుంది. అయితే అనసూయకు ఈ రేంజ్ లో స్టార్డమ్ ఒక్క సారిగా రాలేదు. కెరీర్లో ఆమె ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొంది. ఇప్పటికీ ఆమె సర్వైవ్ అయ్యేందుకు వాటిని ఫేస్ చేస్తూనే ఉంది. ప్రముఖ రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ వాటి గురించి వివరించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను వివరించాడు.
బెజవాడ ప్రసన్న కుమార్ జబర్దస్త్ కు రైటర్ గా పనిచేశాడు. అప్పటినుంచి అనసూయతో ఆయనకు మంచి పరిచయం ఏర్పడింది. ఆలీ టాకీస్ చేసే టైంలో తనకు కూడా స్కిట్లు చేసే అవకాశం వచ్చిందని.. ఆ టైంలో తనకు అనసూయ యాక్టింగ్ నేర్పించిందంటూ చెప్పుకొచ్చాడు. రైటర్ ప్రసన్నకుమార్ అనసూయ షూటింగ్ అయినా తరువాత కూడా నాకు హెల్ప్ చేశారని.. రాత్రి 7, 8 గంటలకు తర్వాత నా దగ్గరకు వచ్చేదని.. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మేము రిహార్సల్స్ చేసేవాళ్లమని.. అనసూయ భర్త భరద్వాజ్ బయట కారులో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడని వివరించాడు. ప్రసన్నకుమార్ ఆమె వర్క్ కోసం ఎంతో డెడికేటెడ్ గా పనిచేసేది.. నాకు అంతే సహాయం చేసిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.