Bigg Boss Vasanthi : గత సీజన్ బిగ్ బాస్ హౌస్ లో చాలా చక్కటి పద్దతి తో కొనసాగిన కంటెస్టెంట్స్ లో ఒకరు వాసంతి కృష్ణన్. ఈమెకి ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్ మామూలుది కాదు. అంతకు ముందు పలు సినిమాల్లో మరియు సీరియల్స్ లో నటించినప్పటికీ వాసంతి కృష్ణన్ కి కావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. కానీ బిగ్ బాస్ రియాలిటీ షో, ఆ తర్వాత ఆమె నీతోనే డ్యాన్స్ ప్రోగ్రాం లో దుమ్ము లేచిపోయే రేంజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం తో వాసంతి అందరికీ ఫేవరెట్ అయిపోయింది.
బిగ్ బాస్ నుండి బయటకి రాగానే ఆమెకి ‘అవును..వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ అనే సీరియల్ లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సీరియల్ తర్వాత ఆమె మరో సీరియల్ లో కనిపించలేదు, ప్రస్తుతం కెరీర్ పరంగా ఆఫర్స్ తగ్గడం తో ఆమెకి ఇంట్లో పెళ్లి చేసేందుకు సిద్ధం అయ్యారు పెద్దలు.
చాలా కాలం నుండి ఈమె తన తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ తో ప్రేమాయణం లో ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె పవన్ కళ్యాణ్ అనే స్నేహితుడితో నేడు నిశ్చితార్థం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నెల రోజుల క్రితం ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చిన వాసంతి, అకస్మాత్తుగా నిశ్చితార్థం చేసుకోవడం ఏమిటి అని ఆమె అభిమానులు షాక్ కి గురయ్యారు.
పవన్ కళ్యాణ్ అంటే మన పవర్ స్టార్ కాదు, ఆమె స్నేహితుడు అన్నమాట. వాసంతి కి పవన్ కళ్యాణ్ అంటే ఎంత వీరాభిమానమో మన అందరికీ తెలిసిందే. నిజ జీవితం లో కూడా ఆమెకి పవన్ కళ్యాణ్ పేరు ఉన్న వ్యక్తి భర్త గా రాబోతుండడం విశేషం అనే చెప్పాలి. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి.