Bigg Boss Telugu : ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ మా ఛానల్ లో రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొన్ననే ప్రారంభం అయ్యినట్టు అనిపిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఆరు వారాల్లో ఎన్నో అట్లా పల్టా సంఘటనలు జరిగాయి.

ఊహించని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా, రీసెంట్ గానే మరో 5 మంది కొత్త కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వదిలారు. వీళ్ళను ‘పోటుగాళ్ళు’ గా బిగ్ బాస్ నామకరణం చేసాడు. అలాగే పాత కంటెస్టెంట్స్ ని ‘ఆటగాళ్లు’ గా పరిగణించారు. ఈ రెండు గ్రూప్స్ మధ్యనే ఈ వారం మొత్తం పోటీ నడించింది. ఈ వారం కెప్టెన్సీ టాస్కు పోటాపోటీగా జరగగా, చివరికి ఆటగాళ్లు టీం కి సంబంధించిన యావర్ ఇంటికి మొదటి కెప్టెన్ అయ్యాడు.

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ మరో ఊహకి అందని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని టాక్. రీసెంట్ గానే బాలీవుడ్ లో జరుగుతున్న బిగ్ బాస్ సరికొత్త సీజన్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ మొబైల్ ఫోన్స్ వచ్చేలా చేసాడు. కానీ ఈ మొబైల్ ఫోన్ ని దక్కించుకోవడానికి చాలా టాస్కులు ఆడి కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. వచ్చే వారం నుండి మన బిగ్ బాస్ హౌస్ లో కూడా మొబైల్స్ ని కంటెస్టెంట్స్ కి ఇవ్వబోతున్నారు అట.

రీసెంట్ గానే కంటెస్టెంట్స్ కి కాయిన్స్ గెలవడం, దానిని కొన్ని మనకి ఇష్టమైన లాగజారి బడ్జెట్ ఐటమ్స్ కొనుక్కోవడం కోసం ఉపయోగించుకోవచ్చు అని బిగ్ బాస్ తెలిపిన సంగతి మన అందరికీ తెలిసిందే. వచ్చే వారం కూడా ఇలాగే మొబైల్ ని గెలుచుకోవడం కోసం కాయిన్స్ ని ఉపయోగించుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్తారట. ఇప్పటి నుండి కంటెస్టెంట్స్ ఆట తీరు ఎలా మారబోతుందో చూడాలి.