Bigg Boss Telugu : అశ్విని అంటే ఇంతకుముందు ఎవరికీ తెలియదు. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ గా వచ్చిందో అప్పటి నుంచి పాపులర్ అయిపోయింది. బుల్లి తెర ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం అశ్వినికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అశ్విని ఆల్రెడీ పెళ్లయిందంటూ ప్రచారం అవుతోంది. ఇంతవరకు రహస్యంగా ఉన్న ఈ వ్యవహారం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదట్లో తడబడింది అశ్విని. నామినేషన్ టైంలో కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేయడానికి కరెక్ట్ పాయింట్స్ చెప్పలేకపోయింది. దీంతో ఆమెనే ఓ కార్నర్ చేసి ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్ అందరూ ఆమెపై దాడికి దిగుతూనే ఉన్నారు. ప్రియాంక, శోభ శెట్టి ఆమెను ఎప్పుడూ ఆడుకుంటూనే ఉన్నారు. గత రెండు వారాలుగా ఆమె ఆట కాస్త మెరుగుపడింది. ఇక హౌస్లో సింగర్ భోలేతో మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది.
వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక అశ్విని పర్సనల్ విషయానికి వస్తే వరంగల్ నీట్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన హైప్ రాలేదు. సరిలేరు నీకెవరు మూవీలో రష్మిక మందన రెండో అక్క పాత్రలో ఆమె నటించింది. రాజా ది గ్రేట్ సినిమాలో కూడా ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించింది. అయితే హీరోయిన్ ఎదగాలన్న ఆమె కోరిక మాత్రం నెరవేరలేదు. ఆ తర్వాత ఆమెకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో హీరోయిన్ లకు సరిసమానంగా పాపులారిటీ దక్కించ్చుకుంది. మంచి హైట్, ఆకట్టుకునే అందంతో అశ్విని హీరోయిన్ మెటీరియల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం.. తనకు వ్యక్తిగత జీవితంలో అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందని తెలుస్తోంది. 2013లో తల్లిదండ్రులు ఆమెకు ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి జరిపించారట. కాకపోతే ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా ఆమె తన భర్తనుంచి విడిపోయిందట. విడాకుల తర్వాత మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టిన అశ్విని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందట. అలా బిగ్‌బాస్ హౌస్‌లో లేడీ కంటెస్టెంట్‌గా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే తన క్లోజ్ ఫ్రెండ్ భోలె ఈ వారం ఎలిమినేట్ అవుతున్నాడని సమాచారం.