Bigg Boss Telugu : చేతిలో సినిమాలు లేక విదేశాల్లో అలాంటి పనులు చేస్తూ బ్రతుకుతున్న బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్!

- Advertisement -

Bigg Boss Telugu : ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ బిగ్ బాస్ సీజన్స్ లో టాస్కులు పెద్దగా ఆడకపోయినా కూడా, కేవలం కూల్ యాటిట్యూడ్ తో సీజన్ మొత్తం కొనసాగి బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ ని గెలుచుకున్న కంటెస్టెంట్ అభిజిత్. ఇతను చూసేందుకు విజయ్ దేవరకొండ లాగ, చాలా స్మార్ట్ గా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఈయన హీరో గా నటించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం లో విజయ్ దేవరకొండ ఒక్క చిన్న క్యారక్టర్ కూడా చేసాడు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

అయితే బిగ్ బాస్ సీజన్ 4 తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు అమితంగా దగ్గరైన అభిజిత్ కి బయటకి వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాలు క్యూలు కట్టేస్తాయని అందరూ అనుకున్నారు. వెంకీ అట్లూరి వంటి డైరెక్టర్స్ కూడా అభిజిత్ ని హీరో గా పెట్టి సినిమా తియ్యడానికి సిద్ధంగా ఉన్నట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి.

Abajith

కానీ అలాంటివేమీ జరగలేదు.. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా చేసిన సోహెల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసాడు కానీ, అభిజిత్ నుండి మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. మధ్యలో అమెజాన్ ప్రైమ్ లో ఒక వెబ్ సిరీస్ చేసాడు కానీ, ఆ సిరీస్ గురించి ఎవ్వరూ అసలు పట్టించుకోలేదు.

- Advertisement -
CHiranjeevi

అయితే అసలు అభిజిత్ ప్రస్తుతం ఏమి చేస్తున్నాడు?, ఎందుకు అతను చేతులారా తన కెరీర్ ని నాశనం చేసుకుంటున్నాడు అని అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే అభిజిత్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా, అన్నీ పక్కన పెట్టేసి విదేశీ పర్యటనలు చేస్తూ, కాలక్షేపం చేస్తున్నాడు. పెళ్లి కూడా ఇప్పట్లో చేసుకునే ఆలోచన లేదట. అలా వేరే లెవెల్ కి వెళ్ళిపోతాడు అనుకున్న అభిజిత్ ఎటు కాకుండా పోయి కేవలం విదేశీ టూర్స్ కి పరిమితం అవ్వడం ఆయన ఫ్యాన్స్ కి బాధ కలిగిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here