Bigg Boss Telugu 7 రెండవ కెప్టెన్ గా యావర్.. ఇన్ని రోజుల కష్టం ఫలించింది భయ్యా!

- Advertisement -

Bigg Boss Telugu 7 : స్టార్ మా ఛానల్ లో రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం టాస్కులు ఎంత రసవత్తరంగా సాగాయి మనమంతా చూస్తూనే ఉన్నాము. ‘ఆటగాళ్లు’ టీం మరియు ‘పోటుగాళ్ళు’ టీం నువ్వా నేనా అనే రేంజ్ హోరాహోరీగా టాస్కులు ఆడారు. నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన టాస్కులో రెండు టీమ్స్ సరిసమానంగా నిలిచాయి.

Bigg Boss Telugu 7
Bigg Boss Telugu 7

అయితే కెప్టెన్సీ టాస్కులో చివరి గేమ్ కూడా నిన్న రాత్రే జరిగింది అట. ఈ టాస్కులో ప్రిన్స్ యావర్ గెలుపొంది ఇంటికి రెండవ కెప్టెన్ గా మారాడు. మొదటి కెప్టెన్ గా పల్లవి ప్రశాంత్ నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు యావర్ ఇంటి కెప్టెన్ అవ్వడం కేవలం ప్రేక్షకులకు మాత్రమే కాదు, హౌస్ మేట్స్ కి కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇక కెప్టెన్ అయ్యేసరికి యావర్ ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి.

Yaavar

హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి యావర్ టాస్కులలో వందకి 200 శాతం తన బెస్ట్ ఇస్తూ వచ్చాడు. కానీ ఎంత కష్టపడినా కూడా అతనికి విజయం దక్కలేదు. ఇంటి సభ్యుడు అవ్వడానికి ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే యావర్ కష్టపడ్డాడు. కానీ హౌస్ మాటే కాలేకపోయాడు. ఇక పవర్ అస్త్ర టాస్కు ని ముగించి బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కు ని మొదలు పెట్టాడు.

- Advertisement -
Bigg Boss Telugu 7 caption

గత వారం అతను కెప్టెన్సీ టాస్కులో పాల్గొని ఉంటే కచ్చితంగా గెలిచేవాడేమో. కానీ లెటర్ టాస్కులో తేజా కోసం తన కెప్టెన్సీ కంటెండర్ షిప్ ని వదులుకున్నాడు. అందరికీ చాలా బాధేసింది. కానీ ఈసారి మాత్రం ఆయన పట్టువదలకుండా రెట్టింపు ఉత్సాహం తో కెప్టెన్సీ టాస్కు ఆడి గెలుపొందాడు. ఇతని గెలుపుని సోషల్ మీడియా లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. యావర్ కి శుభాకాంక్షలు తెలియచేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here