Bigg Boss Telugu 7 : ఎంత ఆసక్తికరంగా సాగుతూ ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రతీ వారం ఎవ్వరూ ఊహించని ట్విస్టులతో సర్ప్రైజ్ చేస్తూ వస్తున్న బిగ్ బాస్ గత ఆదివారం రోజు 5 మంది కొత్త కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లోపలకు పంపిన సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళు వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులను ‘ఆటగాళ్లు’ మరియు ‘పోటుగాళ్ళు’ అని రెండు గ్రూప్స్ గా డివైడ్ చేసారు.

‘ఆటగాళ్లు’ టీం లో పాత కంటెస్టెంట్స్ ఉంటారు, ‘పోటుగాళ్ళు’ టీం లో కొత్త కంటెస్టెంట్స్ ఉంటారు. ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పుడు కెప్టెన్సీ టాస్కు ని నిర్వహించాడు బిగ్ బాస్. ఇప్పటి వరకు రెండు టాస్కులు జరిగితే, ఈ రెండు టాస్కులలో ‘పోటుగాళ్ళు’ టీం ప్రస్తుతం ముందంజ లో ఉంది. ఈ టీం లీడింగ్ లో ఉన్నదానికి కారణం గౌతమ్ అనే చెప్పాలి.

ఇకపోతే పాపం అమర్ దీప్ ని ఈ కెప్టెన్సీ టాస్కులో బిగ్ బాస్ పరువు తీసేసాడు. జీనియస్ రౌండ్ లో పోటుగాళ్ళు టీం తరుపున గౌతమ్, ఆటగాళ్లు టీం తరుపున అమర్ దీప్ వచ్చారు. LED స్క్రీన్ మీద చూపించిన ఇమేజిలలో ఉండే వాటిని చూసి బిగ్ బాస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అలా మొదటి ఫోటో లో గన్ మరియు చెట్టు మీద ఉన్న పక్షులు కనిపిస్తాయి. గన్ తో కాల్చినప్పుడు చెట్టు మీద ఎన్ని పక్షులు ఉంటాయి అని బిగ్ బాస్ అడుగుతాడు. అప్పుడు అమర్ దీప్ నుండి వెంటనే సమాధానం రాదు, ఆలోచిస్తూ ఉంటాడు, అప్పుడు శివాజీ దొంగచాటున అమర్ దీప్ కి సమాధానం అందించడం తో, గన్ తో కాల్చినప్పుడు చెట్టు మీద పక్షులు ఉండవు బిగ్ బాస్ అంటాడు. సమాధానం కరెక్ట్ అయ్యినప్పటికీ కూడా, శివాజీ సహాయం చెయ్యడం వల్ల ఒక పాయింట్ ని నష్టపోయి ఓడిపోవాల్సి వస్తుంది.

మరో ప్రశ్న ఏమిటంటే కనిపిస్తున్న ఈ కేక్ లో 800 కాలరీస్ ఉన్నాయి. ఆ కేక్ ని రెండు భాగాలుగా కట్ చేస్తే ఎన్ని కాలరీస్ మిగులుతుంది అనగా, గౌతమ్ 800 ఉంటుంది అని కరెక్ట్ గా సమాధానం ఇస్తాడు. అప్పుడు అమర్ దీప్ ని మీరు కరెక్ట్ సమాధానం ఏమని అనుకుంటున్నారు అనగా, 800 కాలరీస్ అంటున్నారు కాబట్టి, రెండు గా కట్ చేస్తే 400 ఉంటుంది అనుకుంటున్నా బిగ్ బాస్ అని సమాధానం ఇస్తాడు. వెంటనే హౌస్ లో ఉన్న వాళ్లంతా నవ్వుతారు. అప్పుడు అమాయకం గా పెట్టిన అమర్ ముఖాన్ని చూస్తే ఎవరికైనా జాలి వెయ్యాల్సిందే. హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించే అమర్ దీప్, పాపం ఎందుకో ఈసారి మానసికంగా బాగా డౌన్ అయిపోయాడు, ఇలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో స్థానం దక్కించుకోవడం కష్టమే.