Bigg Boss Telugu : షాకింగ్.. మిడ్ వీక్ లో హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్

- Advertisement -


Bigg Boss Telugu : బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఆదివారంతో ముగియనుంది. ఫైనల్ రేసులో టైటిల్‌ను ఎవరు గెలుస్తారోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హౌసులోకి ప్రవేశించిన 19 మందిలో ఇప్పుడు ఆరుగురు హౌస్ మేట్స్ మాత్రమే మిగిలారు. కానీ గ్రాండ్ ఫినాలే సమయానికి కేవలం ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారు. దీంతో వారం మధ్యలో ఓ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేశారు. అయితే మిడ్‌వీక్ ఎలిమినేషన్‌లో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు వెళ్లబోతున్నారనే టాక్ ఉంది.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

బిగ్ బాస్ విన్నర్ టైటిల్ కోసం ముగ్గురి మధ్య గట్టి పోరు సాగుతుంది. పల్లవి ప్రశాంత్, అమర్, శివాజీ ఉన్నారు. ఈ ముగ్గురికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడమే కాదు. కాబట్టి ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు కచ్చితంగా బిగ్ బాస్ విజేత అవుతారు. ఇక ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వారిలో ప్రియాంక, యావర్ మొదటి నుంచి హౌసులో ఉంటున్నారు. టాస్క్‌లు కూడా బాగా ఆడుతున్నారు. అర్జున్ టాస్క్‌లు చాలా బాగా ఆడాడు.. కానీ మధ్యలో వైల్డ్ కార్డ్ ద్వారా హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు.

Yawaar

తాను శివాజీ దగ్గర అమర్ గురించి, అమర్ దగ్గర శివాజీ గురించి నెగిటివ్‌గా మాట్లాడుతూ గో.పిలా వ్యవహరిస్తున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో ఆయనపై నెగిటివిటీ పెరిగింది. ఈ విధంగా చూస్తే అర్జున్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రిన్స్ యావర్ కూడా ఓటింగ్‌లో వెనుకబడ్డాడు. అంటే యావర్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మిడ్‌వీక్‌లో యావర్ ఎలిమినేట్ అయితే, హౌస్ నుండి స్ట్రాంగ్ కంటెంట్ బయటకు వెళ్లినట్లు అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here