Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ అద్భుతంగా ఎంటర్టైన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతకు ముందు వారికి ఎంత ఫేమ్ ఉంది అనేది పక్కన పెడితే, ఈ సీజన్ ద్వారా మాత్రం ప్రతీ ఒక్కరు మంచి ఫేమ్ ని సంపాదించుకొని వెళ్లారు. కచ్చితంగా వీళ్ళందరికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే కొంతమంది కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే మంచి ఫేమ్ ఉంది. వారిలో అంబటి అర్జున్ కూడా ఒకడు. ఇతను టీవీ సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. అలాగే ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా ఎక్కువగా కనిపించేవాడు. వీటితో పాటుగా పలు సినిమాల్లో హీరోగా కూడా చేసాడు. మొదటి వారం లోనే హౌస్ లోకి అడుగుపెట్టి ఉంటే కచ్చితంగా కప్ కొట్టుకొని వెళ్ళేవాడు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రావడం తో టాప్ 6 కంటెస్టెంట్ గా నిలిచాడు.

ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే ముందు కొన్నాళ్ల క్రితం ఆయన ‘అర్ధనారీ’ అనే సినిమా చేసాడు. ఇందులో అర్జున్ ‘ట్రాన్స్ జెండర్’ గా నటించాడు. అయితే ఇందులో అర్జున్ లుక్ అప్పట్లో పెద్దగా ఫేమస్ అవ్వలేదు కానీ, ఇప్పుడు చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో ఆ సినిమాకి సంబంధించిన లుక్ బయటకి వచ్చింది. ఈ లుక్ ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజంగానే అర్జున్ యేనా?,ఇలా మారిపోయాడు ఏంటి అనుకున్నారు.

ముందుగా ఇది సినిమాలోని లుక్ అని ఎవరికీ తెలియదు. ఈ లుక్ వచ్చిన తర్వాత ఎవరో అనుకోని గూగుల్ సెర్చ్ చెయ్యగా, అది అర్జున్ అని తెలిసింది. దీనిని చూసి అర్జున్ ఇన్ని సినిమాల్లో నటించి ఉన్నాడా?, ఇన్ని రోజులు తెలియలేదుగా అని ఆశ్చర్యపోతున్నారు. బిగ్ బాస్ 7 ఆయనకీ మంచి ఫేమ్ తో పాటుగా, అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం లో అర్జున్ ఒక ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు.