బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరుగుతాయి, మనస్పర్థలు వస్తాయి. చాలామంది ప్రేక్షకులు ఈ గొడవల్లో ఉండే మజా కోసమే ఈ షోను చూస్తారు. అంతే కాకుండా కంటెస్టెంట్స్ వేసే ఎత్తులు, పైఎత్తులకు కూడా కొందరు ప్రేక్షకులు ఫిదా అవుతారు. తాజాగా శారీరిక బలంతో అవతల టీమ్‌తో పోటీపడలేని కంటెస్టెంట్స్ బుద్ధిబలం చూపించాలని అనుకున్నారు.
ఒకవైపు రణధీర, మహాబలి టీమ్స్‌కు ఛాలెంజ్ నడుస్తున్న సమయంలోనే శుభశ్రీ వెళ్లి పవర్ అస్త్రాను దొంగిలించి బాత్రూమ్లో దాచింది. ఈ దొంగతనంలో శుభశ్రీకి దామిని కూడా సహకరించింది. అసలు వారు పవర్ అస్త్రాను ఎందుకు దొంగిలించారు, వారి ప్లాన్ ఏంటి అని చాలామంది ప్రేక్షకులకు సైతం అర్థం కాలేదు. ఓవైపు మహాబలి టీమ్‌లోని సభ్యులు పవర్ అస్త్రాను దొంగిలించే పనిలో బిజీగా ఉంటే రణధీర టీమ్ మాత్రం రెండు ఛాలెంజ్‌లలో విజేతలుగా నిలిచి మాయాస్త్రాన్ని సాధించారని బిగ్ బాస్ ప్రకటించారు.
మాయాస్త్రాన్ని అందుకోవడం కోసం యాక్టివిటీ ఏరియాలోకి రమ్మని బిగ్ బాస్.. రణధీర టీమ్ సభ్యులను పిలిచారు. దీంతో అమర్దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా యాక్టవిటీ ఏరియాలోకి వెళ్లారు. అక్కడ వాతావరణం అంతా చూసి ఉత్సాహంతో అరిచారు. ఆ తర్వాత మాయాస్త్రంలోని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్కరు తీసుకున్నారు. ఈ ఆరుగురు తరువాత ఎపిసోడ్స్‌లో పవర్ అస్త్రా కోసం పోటీపడబోతారని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు.