Bigg Boss 7 Telugu TRP Rating: ‘బిగ్ బాస్’ సీజన్-6 తెలుగు ప్రేక్షకులను ఎంతగా బోరు కొట్టించిందో తెలిసిన విషయమే. అందులో కంటెస్టెంట్స్ నచ్చలేదో, కంటెంట్ బాలేదో కానీ ప్రేక్షకులు ఆ సీజన్ ను లైట్ తీసుకున్నారు. ఆ ప్రభావం ఆ షోను ప్రసారం చేస్తున్న మాటీవీ చానెల్‌పై బాగాపడింది. మరీ రొటీన్‌గా ఉండటం, కాన్సెప్ట్స్ తెలిసిపోవడం వల్ల.. ఇందులో కొత్త ఏముంటుందిలే అనే భావన ప్రేక్షకుల్లో రావడంతో క్రియేటర్స్ ఈ సారి సీజన్ కోసం బాగా కష్టపడాల్సి వచ్చింది. ఉల్టా పుల్టా క్యాప్షన్తో ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఈ సీజన్‌ను నడిపిస్తున్నారు మేకర్స్. అలాగే, ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ కు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. దాని ఫలితం.. టీఆర్పీ రేటింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 7 అందరి అంచనాలను తలకిందులు చేస్తోంది. రోజు రోజుకు విపరీతంగా అలరిస్తోంది ఈ సీజన్. సీరియల్ బ్యాచ్, రైతు బిడ్డ, పాట బిడ్డ, ఇలా సినీ తారలు ఈ సీజన్లో సందడి చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ కూడా గత సీజన్ లో జరిగిన పొరపాట్లు చేయకుండా మొదటి నుంచి మంచి ప్లానింగ్ తో ముందుకు తీసుకెళ్తున్నాడు. టెన్షన్ బాక్స్ నామినేషన్లు, రసవత్తరమైన ఆటలు, మధ్యమధ్యలో శోభ, ప్రియాంకల అందాలు అందరికీ న్యాయం చేస్తూ షో సక్సెస్ అవుతుంది. ఈ సీజన్‌లో మొదట 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. ఆ తర్వాత మరో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. వీరిలో మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, 3వ వారంలో దామిని, 4వ వారంలో రతిక, 5వ వారం సుభశ్రీ, 6వ వారంలో నాయని, 7వ వారంలో పూజ, సందీప్ ఎలిమినేట్ అయ్యారు. 8వ వారం, 9వ వారంలో టేస్టీ తేజ, 10వ వారంలో భోలే. ఇక 11వ వారంలో శోభా శెట్టి, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్, అంబటి అర్జున్, అమర్‌దీప్ చౌదరి, అశ్విని, గౌతమ్ కృష్ణలు నామినేట్ అయ్యారు. ప్రస్తుతం శోభాశెట్టి, ప్రియాంక చివరి స్థానంలో ఉండగా, యావర్ ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నారు. మరి ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారో చూడాలి.

ఇదిలావుంటే, ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోతుంది. బార్క్ వెబ్‌సైట్ విడుదల చేసిన రేటింగ్స్ ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 7 మొదటి రెండు స్థానాల్లో ఉంది. వీకెండ్ 6.9 టీఆర్పీ, వీక్ డేస్ లో 4.91 గా నమోదైంది. ఇక మూడో స్థానాన్ని స్టార్ మా దక్కించుకుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివార్ ఉంది. ఈ షోకి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించగా.. 4.24 టీఆర్పీ నమోదు అయ్యింది. నాలుగో స్థానంలో ఈటీవీకి చెందిన శ్రీదేవి డ్రామా కంపెనీ నిలిచింది. 3.54 రేటింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అందుకుంది. ఒకప్పుడు బుల్లితెరను ఏకచత్రాధిపత్యంగా ఏలిన జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ 5,6 స్థానాలకు పడిపోయాయి.