Bigg Boss : ఎన్నో భారీ అంచనాల నడుమ ఈమధ్యనే ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 ఎంత ఆసక్తికరంగా సాగుతుందో మన అందరం చూస్తూనే ఉన్నాం. మొదటి ఎపిసోడ్ నుండే ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ముందుకు దూరుకుపోతున్న ఈ సీజన్ ఇప్పుడు నార్గ్వా వారం లోకి అడుగుపెట్టింది. ఈ నాల్గవ వారం లో బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి.

నిన్న జరిగిన నామినేషన్స్ లో ప్రియాంక మరియు రతికా నామినేట్ అవ్వగా, ఈరోజు మిగిలిన నామినేషన్స్ జరగబోతున్నాయి. కాసేపటి క్రితం విడుదలైన ప్రోమోస్ లో పల్లవి ప్రశాంత్ మరియు అమర్ దీప్ మధ్య , అలాగే శివాజీ మరియు గౌతమ్ మధ్య ఒక రేంజ్ లో గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు హౌస్ లో శివాజీ కి ఎదురు మాట్లాడిన వాడు లేదు. కొన్ని సందర్భాలలో ప్రియాంక వంటి వారు కాస్త ఫైర్ అయ్యారు కానీ, మళ్ళీ కలిసిపోయారు.

కానీ నేడు గౌతమ్ మరియు శివాజీ మధ్య జరిగిన గొడవ చూస్తూ ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు వీళ్లిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేలా అనిపించడం లేదు. ఇక పల్లవి ప్రశాంత్ మరియు అమర్ దీప్ మధ్య మొదటి వారం నుండి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మళ్ళీ వీళ్ళ గొడవ మధ్య తారాస్థాయికి చేరుకుంది. పల్లవి ప్రశాంత్ ని అమర్ దీప్ నామినేట్ చేస్తూ,బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా వారాలు గడిచేకొద్దీ ఆటోమేటిక్ గా మాస్కులు తొలగించేస్తారు, కానీ నువ్వు మాత్రం భలే మైంటైన్ చేస్తున్నావ్ అంటూ చెప్పుకొస్తాడు.

అప్పుడు ప్రశాంత్ మాటికొస్తే నాకు మూడు ముఖాలు ఉన్నాయి అంటావ్, ఎక్కడ అన్నా నా నెత్తి మీద కూడా మరో ముఖం ఉందా చూపించు అంటాడు. అప్పుడు అమర్ దీప్ దానికి కారణాలు చెప్తుండగా, ఇందాకటి దాకా బాగున్నా నువ్వు, కాసేపు క్రితమే బోనులో నిల్చున్నప్పుడు ఊగిపోయావ్ కదా, అది నీలో రెండవ ముఖం కాదా అనగా అమర్ దీప్ ఫ్రస్ట్రేషన్ లో అరుస్తాడు, ఆ తర్వాత ఏమి జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి.