Bigg Boss : బిగ్ బాస్ రియాలిటీ షో ఒక విధంగా చెప్పాలంటే చాలా డేంజర్ అనొచ్చు. ఎందుకంటే సెలబ్రిటీస్ తాలూకు నిజమైన క్యారెక్టర్స్ ని బయటపెట్టే రియాలిటీ షో ఇది. ప్రారంభం నుండి ఎండింగ్ వరకు పాజిటివ్ ఇమేజి ని సంపాదిస్తే, బయటకి వచ్చిన తర్వాత ఇమేజి ఒకలాగా ఉంటాది. నెగటివ్ ఇమేజి తో బయటకి వచ్చిన వాళ్లకు ఇమేజి మరొకలాగా ఉంటాది.
టీవీ సీరియల్స్ ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రియాంక మరియు శోభా శెట్టి కి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఎలాంటి నెగటివిటీ పెరిగిందో మన అందరికీ తెలిసిందే. ప్రియాంక జైన్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘జానకి కలగనలేదు’ మరియు ‘మౌనరాగం’ వంటి సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. కేవలం ఈ సీరియల్స్ ద్వారా మాత్రమే కాకుండా పలు ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా ఆడియన్స్ కి దగ్గరైంది.
ఇక శోభా శెట్టి గురించి మన అందరికీ తెలిసిందే..మనిషి మనస్తత్వం మంచిదే, కాకపోతే ఆమెలోని అగ్రెసివ్ యాటిట్యూడ్ వల్ల జనాలకు ఆమె ఎక్కువగా నెగటివ్ యాంగిల్ లోనే కనిపించింది. అంతే కాదు ఈమె ‘కార్తీక దీపం’ సీరియల్ లో క్రూరమైన విలన్ గా నటించడం కూడా ఆమెకి నెగటివ్ అయ్యింది. జనాలు ఆమె ఏమి మాట్లాడిన నెగటివ్ గా తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం అయ్యింది. ఇక 13 వ వారం లో శివాజీ తో ఆమె పడిన గొడవ, శివాజీ ఆమెని నెగటివ్ చేసిన విధానం వల్ల శోభా శెట్టి బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకుంది. ఇక ప్రియాంక జైన్ ని అయితే నెటిజెన్స్ అందరూ ఆమెని ఒక ఫేక్ మనిషి అంటున్నారు.
ఎందుకంటే హౌస్ లో ఉన్నన్ని రోజులు అమర్ దీప్ తో స్నేహం గా ఉన్నట్టు నటించి, బయటకి వచ్చిన తర్వాత మాత్రం అతనితో మాట్లాడడం పూర్తిగా మానేసింది. ఈ ఒక్క కారణం వల్ల మాత్రమే కాదు, హౌస్ లో జరిగిన అనేక విషయాలు ఆమెపై నెగటివిటీ పెంచేలా చేసాయి. ఇప్పుడు ఈ నెగటివిటీ తో వీళ్లిద్దరికీ సినిమా మరియు సీరియల్ ఆఫర్స్ కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటి వరకు ప్రియాంక జైన్ కి కానీ, శోభా శెట్టి కి కానీ ఒక్క సీరియల్ లో కూడా నటించే ఆఫర్ రాలేదట. దీంతో ఈ ఇద్దరు కన్నడ బ్యూటీలు కన్నడ సినీ పరిశ్రమ కి షిఫ్ట్ అవ్వబోతున్నారని టాక్.