Bigg Boss : ఈ సీజన్ అంతా బాగానే ఉంది కానీ, ఒక కంటెస్టెంట్ పట్ల బిగ్ బాస్ చాలా ప్రేమ చూపించాడని, ఆమెని నామినేషన్స్ నుండి కావాలనే సేవ్ చేస్తూ వచ్చారని, 5 వ వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ని ఇంత దూరం లాగడం అనేది సాధారణమైన విషయం కాదని, బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొట్టమొదటిసారి అని శోభా శెట్టి గురించి అనుకుంటూ ఉన్నారు ఆడియన్స్.

ప్రతీ వారం శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుంది అని అనుకోవడం, ఆమె చాలా తేలికగా సేఫ్ అవుతూ రావడం జరుగుతూనే ఉంది. గత వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యి, శోభా శెట్టి సేవ్ అవ్వడం ని జనాలు అసలు తీసుకోలేకపోయారు. అలా శోభా శెట్టి ఎలిమినేషన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఆడియన్స్ కి ఇప్పుడు శుభ వార్త అభిమానులను సంబరాలు చేసుకునేలా చేస్తుంది.

ఈ వారం అందరికంటే అతి తక్కువ ఓట్లు రావడం తో శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తుంది. అందరూ ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అని అనుకున్నారు కానీ, కేవలం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందట. శోభా ఎలిమినేట్ అయిన తర్వాత ఆరు మంది కంటెస్టెంట్స్ మిగులుతారు. వారిలో యావర్ శోభా తర్వాత డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ కాబట్టి, ఆయన మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇక పోతే శోభా శెట్టి హౌస్ లోకి అడుగుపెట్టక ముందే ఆమెకి సీరియల్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ఉంది. ఎందుకంటే అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చిన ‘కార్తీక దీపం’ సినిమాలో ఆమె పోషించిన విలన్ పాత్రకి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఆమెకి రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఇచ్చారట. వారానికి రెండు లక్షల చొప్పున, 14 వారాలకు ఆమెకి 28 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
