Bigg Boss : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ‘ఏవిక్షన్ పాస్’ ని గెలుచుకున్న కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ముందుగా యావర్ ఈ పాస్ ని గెలుచుకుంటాడు, ఆ తర్వాత అతను ఫౌల్ గేమ్స్ ఆడాడు అని నాగార్జున వీడియోస్ తో సహా నిరూపించి చూపడం తో గెలుచుకున్న ఏవిక్షన్ పాస్ ని తిరిగి ఇచ్చేస్తాడు.

అప్పుడు బిగ్ బాస్ మరోసారి ‘ఏవిక్షన్ పాస్’ గేమ్ ని పెట్టగా, పల్లవి ప్రశాంత్ చాలా తేలికగా ఆటల్ని గెలిచి ‘ఏవిక్షన్ పాస్’ ని సొంతం చేసుకుంటాడు. ఈ ఏవిక్షన్ పాస్ ని కేవలం 14 వ వారం లో మాత్రమే ఉపయోగిస్తాను అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. కానీ ఈ వారం ‘టికెట్ టు ఫినాలే’ అర్జున్ గెలవడం తో ‘ఏవిక్షన్ పాస్’ ని ఈరోజే వాడమని నాగార్జున పల్లవి ప్రశాంత్ కి చెప్తాడు.

ఆదివారం జరిగే ఎపిసోడ్ లో గౌతమ్ మరియు శోభా ఎలిమినేషన్ రౌండ్ లోకి వస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఏవిక్షన్ పాస్ ని ఉపయోగించి సేవ్ చెయ్యమని నాగార్జున పల్లవి ప్రశాంత్ ని అడుగుతాడు. కానీ ప్రశాంత్ మాత్రం నేను ఉపయోగించను అని మొండికేస్తాడట. శోభా శెట్టి తనకి ఉపయోగించాల్సిందిగా ప్రశాంత్ ని రిక్వెస్ట్ చేస్తుంది, కానీ ఆయన ఒప్పుకోదు.

గౌతమ్ ప్రశాంత్ ని రిక్వెస్ట్ చేసి ఉంటే ప్రశాంత్ ఇచ్చేవాడేమో కానీ, గౌతమ్ నాకు అవసరం లేదు సార్, జనాల ఓటింగ్ ఉన్నన్ని రోజులు ఉంటాను..ఈ ఏవిక్షన్ పాస్ అక్కర్లేదు అని అంటాడు. అప్పుడు పల్లవి ప్రశాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫైర్ అయిన నాగార్జున ఏవిక్షన్ పాస్ ని రద్దు చేసి స్టోర్ రూమ్ లో పెట్టిస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి, ఈ ఎపిసోడ్ ప్రశాంత్ కి బాగా మైనస్ అవ్వొచ్చు.
