Bigg Boss 8 Promo బిగ్ బాస్ 8 లోగో లో ఇంత అర్థం ఉందా..? 8 మధ్యలో ఉన్న గుర్తుకు అర్థం అదేనా!

- Advertisement -

Bigg Boss 8 Promo కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సీజన్ బిగ్ బాస్ మరో 45 రోజుల్లో స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. ఈ షో కి సంబంధించి సోషల్ మీడియా లో రోజుకి ఒక వార్త ప్రచారంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే నిన్ననే ఈ షో కి సంబంధించిన లోగో ని స్టార్ మా ఛానల్ విడుదల చేసింది. ఈ లోగో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా, ఆలోచించే విధంగా ఉంది. 8 అనే అంకెను ఇన్ఫినిటీ (అనంతం) ఆకారం లో ప్రెజెంట్ చేస్తూ, ఆడియన్స్ కి ఒక సందేశం పంపే ప్రయత్నం చేసారు. అంటే టాస్కులు పరంగా, ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సీజన్ అనంతం అని ఈ లోగో ద్వారా చెప్పకనే చెప్పారు మేకర్స్.

Bigg Boss 8 Promo
Bigg Boss 8 Promo

అంతే కడకుండా ఇన్ఫినిటీ గుర్తు మధ్యలో ఒక పుష్పం ఆకారం తో ఉన్న గుర్తుని కూడా మనం గమనించొచ్చు. ఈ గుర్తు యొక్క అర్థం అష్ట దిగ్బంధనం. అంతే కాకుండా ఈ గుర్తు ఇన్ఫినిటీ గుర్తుకి రెండు సర్కిల్స్ మధ్యలో ఉంది. అంటే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో రెండు హౌస్లు ఉంటాయని. రెండవ హౌస్ లో ఉండేవాళ్ళు టాస్కులు గెలిచి, మొదటి హౌస్ లోకి వెళ్తారని, అలాగే మొదటి హౌస్ లో టాస్కులలో అతి తక్కువ పెర్ఫార్మన్స్ ఇచ్చిన వాళ్ళు రెండవ హౌస్ లోకి వెళ్తారని, అలా రెండవ హౌస్ లో అందరికంటే తక్కువగా ఉన్నవారు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది.

Bigg Boss Telugu 8 Coming Soon | #BiggBossTelugu8 on Star Maa - YouTube

- Advertisement -

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుంది. ఇకపోతే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి బిగ్ బాస్ యాజమాన్యం దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. గత సీజన్ లో రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ సతీమణి తేజస్విని గౌడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టడం నూటికి నూరు శాతం ఖరారు అయ్యింది. అలాగే కిరాక్ ఆర్ఫీ, హారిక, ప్రభాకర్, చమ్మక్ చంద్ర వంటి వారితో కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. వచ్చే నెలలో పూర్తి స్థాయి టీజర్ ని విడుదల చెయ్యబోతున్నారు. ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ కంటే ఈ సీజన్ చాలా బిన్నంగా, కొత్తగా ఉండబోతుంది.

Nagarjuna Akkineni Hosts Bigg Boss Telugu 8: Launch Date, Promo Release, Contestant List, & Everything You Need To Know

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here