Sandeep : మళ్లీ హౌస్లోకి వెళ్తాను.. దొంగాట ఆడేవాళ్ల ఆట కట్టిస్తానంటున్న సందీప్

- Advertisement -


Sandeep : బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా కొనసాగుతోంది. హౌస్ నుంచి 8వ వారంలో సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ ఎలిమినేషన్ గురించి ప్రేక్షకులకు ముందే తెలిసింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. లెక్క ప్రకారం ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వాలి. కానీ అనూహ్యంగా బాగా ఆడుతున్న సందీప్ మాస్టర్ ను తప్పించారు.. ఎందుకిలా చేశారని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. దీనికి హోస్ట్ నాగార్జున పరోక్షంగా సమాధానమిచ్చారు. ఈరోజు ఎపిసోడ్‌లో సందీప్ వేదికపైకి వచ్చిన తర్వాత నాగార్జున ఒక డైలాగ్ కొట్టాడు. అది ఏమిటంటే?.. నాగార్జున చాలా గొప్ప యాక్టరన్న విషయం తెలుగు ప్రజలందరికీ బాగా తెలుసు. ఆయన స్టేజ్ మీద కూడా బాగానే యాక్ట్ చేస్తున్నారు. ఈరోజు సందీప్ ఎలిమినేట్ అయి స్టేజ్ పైకి వచ్చిన తర్వాత నువ్వు ఎలిమినేట్ అవుతావని అస్సలు ఊహించలేదని డైలాగ్ కొట్టాడు. వాస్తవానికి సందీప్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్. అందరూ అతడు టాప్ 5కంటెస్టెంట్లలో ఉంటాడని భావించారు. నిన్న జరిగిన ఎలిమినేషన్ చూస్తుంటే ఈ ఓటింగ్ అంతా మాయేనని తేలిపోయింది. నిజానికి ఈ వారం శోభా కంటే సందీప్‌కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. పైగా ప్రవర్తనలో సైకో శోభా కంటే సందీప్ మాస్టర్ 100 రెట్లు బెటర్. ఇక నెగిటివిటీ శోభాకి ఉన్నంత ఏ కంటెస్టెంట్‌పైనా లేదు. ఈ లెక్కల ప్రకారం చూస్తే సందీప్ మాస్టర్ సేఫ్ అయి శోభా ఎలిమినేట్ కావాలి. కానీ మేనేజ్‌మెంట్ కోటాలో శోభాను మళ్లీ కాపాడారు.

Sandeep
Sandeep

ఇది ఇలా ఉంటే ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వచ్చిన సందీప్ మాస్టర్ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో విలేకర్లు మళ్లీ కనుక హౌసులోకి వెళితే ఎవరైతే వెనకాలనుంచి దొంగాట ఆడుతారో వాళ్లతో ఓ ఆట ఆడుతాను అంటూ ఫైర్ అయ్యారు. నా సొంత వాడు అనుకున్న అమరే నన్ను మోసం చేశాడు. నా సపోర్టు మాత్రం ఎవరికి లేదు.. కానీ ప్రియాంక మాత్రం చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అన్నారు. ఆమె హౌస్ లోగానీ, టాస్కుల్లోగానీ.. చాలా సెటిల్ గా ఉంటుందని అన్నారు. తనను 5సార్లు కెప్టెన్సీ దగ్గరకి వెళ్లిన తర్వాత వెనక్కి లాగేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. నిజమైన వెన్నుపోటు ప్రియాంకకే జరిగింది. టాప్ త్రీలో ఎవరని అడిగితే.. ప్రియాంక, ప్రశాంత్, యావర్ ఉంటారన్నారు.. రెండు వారాల తర్వాత శివాజీ గేమ్ ఆడలేదన్నారు. ఓటింగ్ బాక్స్ లో రతిక లీస్టు ఓట్లు పడ్డాయని తెలిపారు.. దామినీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని తెలిపారు. తాను ఆమెకు ఓటేశానన్నాడు. ఏది ఏమైనా సందీప్ ఎలిమినేషన్ ను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here