బిగ్ బాస్ 7 మిడ్ వీక్ ఎలిమినేషన్ ?? ఆ కంటెస్టెంట్ ని ఇంటికి పంపేయబోతున్నారా..?

- Advertisement -

బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా ఆదరించే రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్. ఉత్తరాదిన సంచలన విజయం సాధించిన బిగ్గెస్ట్ రియాలిటీ షో ని తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారా లేదా అనే అనుమానం మొదట్లో ఉండేది. కానీ తెలుగు ఆడియన్స్ నుండి వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే ఉత్తరాదిన వచ్చిన రెస్పాన్స్ చాలా తక్కువ అనే చెప్పొచ్చు. స్టార్ మా ఛానల్ ని ఇండియా లోనే నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నిలబెట్టింది ఈ రియాలిటీ షో.

బిగ్ బాస్ 7
బిగ్ బాస్ 7

విజయవంతంగా ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, రీసెంట్ గా 7 వ సీజన్ ని కూడా ప్రారంభించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కొద్దీ రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సీజన్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. కంటెస్టెంట్స్ కూడా మొదటి రోజు నుండే చాలా యాక్టీవ్ ఉండడం ఈ సీజన్ కి మంచి రెస్పాన్స్ రావడం లో ప్లస్ అయ్యింది.

అయితే ఈసారి సీజన్ లో మనం అనుకున్నట్టు ఏది జరగదని, చాలా ట్విస్టులు ఉంటాయి అంటూ అక్కినేని నాగార్జున ఇది వరకే ఎన్నో సార్లు చెప్పాడు. దానికి తగ్గట్టుగానే వచ్చే వారం లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ని పెట్టబోతున్నారట బిగ్ బాస్ టీం. ఈ ఎలిమినేషన్ ఒక టాస్కు ద్వారా ఉంటుందని, ఎవరికైతే తక్కువ స్కోర్ వస్తుందో, వాళ్ళు బిగ్ బాస్ లో పోటీ చేసేందుకు అనర్హులుగా పరిగణించి, షో నుండి ఇంటికి పంపేస్తారు అని తెలుస్తుంది.

- Advertisement -

అయితే ఎక్కువ శాతం ఎలిమినేట్ అవ్వడానికి స్కోప్ ఉన్న కంటెస్టెంట్ షకీలానే అట. ఈమె మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుండి ఇంటికి వెళ్లబోతుందని టాక్. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాంటే బుధవారం వరకు వేచి చూడాల్సిందే. ఇక మొదటి వారం పోలింగ్ లో అందరి కంటే లీస్ట్ ఓట్లు దక్కించుకున్న కంటెస్టెంట్ గా కిరణ్ నిల్చింది. ఈమె ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here