Bigg Boss : భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గత సీజన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఈ సీజన్ ని చాలా పకడ్బందీగా, పక్కా ప్లానింగ్ తో దింపారు. కంటెస్టెంట్స్ కూడా ముందు సీజన్ తో పోలిస్తే చాలా బెటర్ గా ఉన్నారు. ఇంతకు ముందు సీజన్స్ లో మొదటి రెండు మూడు వారాలు కంటెస్టెంట్స్ పెద్దగా ఆడేవారు కాదు.

కానీ ఈసారి మాత్రం కసితో ఆడుతున్నారు , బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు కూడా కంటెస్టెంట్స్ కి చాలా ఆసక్తి ని కలిగించేలా చేస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ , ఈసారి హౌస్ లో రాబొయ్యే రోజుల్లో ప్రేమ జంటలు గా మారే అవకాశాలు ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో గౌతమ్ మరియు శుభ శ్రీ జంట ఒకటి.

మొదటి రోజు నుండి గౌతమ్ శుభశ్రీ వెంట పడుతూనే ఉన్నాడు, కానీ ఆమె మాత్రం ఇతనిని పట్టించుకోవడం లేదు. అయితే ఈమధ్య మళ్ళీ వీళ్లిద్దరి మధ్య చిన్నగా స్నేహం మొదలైంది. అదంతా పక్కన పెడితే గౌతమ్ మెడ మీద ఎవరో అమ్మాయి కొరికిన గుర్తులు చాలా ఫ్రెష్ గా కనిపించాయి. ఇది హౌస్ మేట్స్ మొత్తం గమనించి గౌతమ్ ని కాసేపు ర్యాగింగ్ చేసారు.

రాత్రి సమయం లో ఎవరో అతనిని కొరికి వెళ్లిపోయారని ఆట పట్టించారు. ఎవరు అయ్యి ఉంటారు?, శుభ శ్రీ అయ్యి ఉంటుందా అని అతనిని అడుగుతూ హౌస్ మేట్స్ ఆట పట్టించారు. ఆయన మెడ మీద ఉన్న ఆ గుర్తులు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వచ్చిందా, లేదా బయట ఉన్నప్పుడు వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. ఇవన్నీ తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే.
