Bigg Boss గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అనేక భాషల్లో ఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. బుల్లి తెరపై టీఆర్పీ రేటింగ్ కోసం కంటెస్టెంట్ల మధ్య టాస్క్‌లు, గొడవలు పెట్టి షోపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. కానీ హిందీ బిగ్ బాస్ మాత్రం ఓ అడుగు ముందుకు వేసింది. ప్రస్తుతం షోలో ఘాటు రొమాన్స్, లిప్ లాక్స్, దుప్పట్లో సీన్లు ప్రేక్షకులకు కాసింత యలపరం తెప్పించేస్తున్నాయి.

బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో సమర్థ్ జరెల్ కెమెరాను పట్టించుకోకుండా ఇషా మాల్వియాతో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తోంది. అతని వీడియోలు చాలా వరకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఒక క్లిప్‌లో మన్నారా కూడా అతని చర్యలకు ఆశ్చర్యపోయింది. ఇప్పుడు మరో క్లిప్ వైరల్ అయ్యింది, అందులో అంకిత ముందు సమర్త్ మొదట ఇషాపై బలవంతం చేశాడు. తరువాత అతను ఆమెను మంచం మీదకి లాగి దుప్పటితో కప్పాడు. జనాలు వీరిద్దరినీ విపరీతంగా ట్రోల్ చేశారు. వారు కామంతో కళ్లు మూసుకుపోయి ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సమర్థ్ జురెల్, ఇషా మాల్వియా మరొక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో అంకిత సమక్షంలో సమర్త్ ఇషాను కౌగిలించుకున్నాడు. దీని తర్వాత అతడు ఆమె చెంపపై ముద్దుల వర్షం కురిపించాడు. ఇషా ఎందుకు బాగుందని అడుగుతుంది? సమర్థ్ ఇషాను అక్కడక్కడ తాకి, వెనుక నుండి కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ వేరే గదిలోకి వెళ్లారు. సమర్థ్ ఇషాను దుప్పటితో కప్పి, ఆమెను బలవంతంగా మంచం మీద పడుకోబెట్టాడు. ఈ క్లిప్‌పై సమర్థ్, ఇషా ట్రోల్ అవుతున్నారు. ఇది చూసిన ఓ నెటిజన్ వీరిద్దరు కామంతో కొట్టుకుంటున్నారు అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ అది బిగ్ బాస్ హైస్ గది కాదు.. ఓయోది అని రాసుకొచ్చాడు. చింటూ ఇమ్రాన్ హష్మీ అయ్యాడు అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.