Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్ గురించి త్వరలోనే ప్రజలకు తెలుస్తుంది.. ఆ కంటెస్టెంట్స్ పై నాగ్ సీరియస్..

- Advertisement -

Pallavi Prashanth : దామిని ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున హౌస్‌లో ఉన్నవారికి సలహాలు ఇవ్వాలని తెలిపారు. దీంతో దామిని.. హౌస్‌లో శివాజీ తీరును ప్రస్తావించింది. దీంతో శివాజీ తనదైన శైలిలో స్పందించాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన దామినీ ‘బిగ్ బాస్ బజ్’లో మాట్లాడుతూ.. శివాజీ చాలా కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడని వ్యాఖ్యానించింది. ఎలిమినేషన్‌కు ముందు నాగ్.. ఎప్పటిలాగానే ఫన్ గేమ్స్ ఆడించారు.

Pallavi Prashanth
Pallavi Prashanth

ఈ సారి హౌస్‌లో సభ్యులు ఎలాంటివారో చెప్పే ఆట ఆడించారు. ఈ సందర్భంగా కలర్ వీల్‌ను తిప్పుతూ.. కలర్‌కోడ్‌లో ఉన్న ప్రశ్నలు అడిగారు. హౌస్‌లో కన్నింగ్ కంటెస్టెంట్ ఎవరని నాగార్జున అడగగా.. ఆమె పల్లవి ప్రశాంత్ పేరు చెప్పింది. అతడు నామినేషన్స్ రోజు చాలా అగ్రసివ్‌గా.. మిగతా రోజుల్లో ఎక్కడ ఉన్నాడో తెలియనట్లుగా ఉంటాడని పేర్కొంది. దీంతో నాగ్ స్పందిస్తూ.. ప్రశాంత్ అపరిచితుడని అన్నారు. కంటెస్టెంట్లు వేసుకున్న మాస్క్ 3, 4 వారాల్లో తొలగిపోతుందని, ప్రజలకు అంతా తెలుసని తెలిపారు. ఆ తర్వాత రతిక వంతు వచ్చింది. ఈ సందర్భంగా నాగార్జున ‘‘నిన్ను ఆడనివ్వకుండా కిందకు లాగుతున్నది ఎవరు?’’ అని ప్రశ్నించారు.

ఇందుకు ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్‌ల పేరు చెప్పింది. వారిద్దరు తనను ఆట నుంచి డైవర్ట్ చేస్తున్నారని పేర్కొంది. ఇంట్లో కపట నాటక సూత్రదారి ఎవరని.. అమర్‌దీప్‌ను అడిగారు నాగ్. ఇందుకు అతడు శివాజీ పేరును చెప్పాడు. ఆ తర్వాత శివాజీని.. హౌస్‌లో కలుపు మొక్క ఎవరని నాగ్ అడిగారు. ఇందుకు ఆయన టేస్టీ తేజ పేరు చెప్పారు. తాను ఆడడు, ఇతరులను ఆడనివ్వడని అన్నారు. మనిషి మంచోడే.. గుణమే చెడ్డది అంటూ నాగ్ వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత టేస్టీ తేజకు.. అవతలివారిని హర్ట్ చేసి, సంతోషపడే వ్యక్తి ఎవరనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు అతడు బదులిస్తూ దామిని పేరు చెప్పాడు. అనంతరం ప్రియాంకకు కామన్ సెన్స్ లేని వ్యక్తి గురించి చెప్పాలని నాగ్ అడిగారు. ఇందుకు ప్రియాంక పల్లవి ప్రశాంత్ పేరు చెప్పింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here