Prabhas : ఎట్టకేలకు ప్రభాస్ లైఫ్ లోకి స్పెషల్ పర్సన్.. వెయిట్ చేయండి అంటూ పోస్ట్

- Advertisement -

Prabhas: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. తాను నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం అన్నీ భారీ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ లు కొడుతున్నాడు. గత సంవత్సరం సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ త్వరలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కల్కి సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Prabhas
Prabhas

సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇది కాకుండా మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ అనే మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రెండు సినిమాల తర్వాత సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’ సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు సలార్‌ పార్ట్ 2లో నటించాల్సి ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం కానుంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ ఓ కీలక పాత్ర చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు అన్ని పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.

- Advertisement -

కాగా సినిమాల పరంగా అభిమానులను సంతృప్తి పరుస్తున్న ప్రభాస్ .. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . ప్రభాస్ పెళ్లయితే చేసుకుంటాడు కానీ ఎప్పుడు చేసుకుంటాడో తెలియదు అంటూ తన అభిమానులు క్లారిటీకి వచ్చేశారు. మరోసారి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇందుకు కారణం ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్తే. నా జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు.. వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఓ పోస్ట్ చేశాడు. దీంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎట్టకేలకు తన జీవితంలోకి స్పెషల్ పర్సన్.. అంటే తనకు కాబోయే భార్యే అని అనుకుంటున్నారు. కొంతకాలం నుంచి హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రభాస్ ప్రేమాయణం నడుపుతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . దీనిపై ఇద్దరు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. చూడాలి లాస్ట్ కి మన హీరో ఎవరిని చేసుకుంటాడో..?

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here