Inaya Sultana : ఎలక్షన్స్ రిజల్స్ నుంచి బిగ్ రిలీఫ్.. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ ఫోటోస్ పై ఓ లుక్కేయండి

- Advertisement -

Inaya Sultana : కొంత మంది సెలబ్రిటీలు వెండితెర, బుల్లితెరల కన్నా సోషల్ మీడియాలోనే రచ్చ ఎక్కువ చేస్తుంటారు. ఏదో విధంగా జనాలకు కనెక్ట్ అయ్యేందుకు చిట్ చాట్ లేదంటే రీల్స్, వీడియో చేసి వారితో నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఇటీవల కాలంలో దర్శకనిర్మాతలు సైతం సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొపైల్ అండ్ ఫాలోవర్స్‌ను బట్టి హీరోయిన్లను సెలక్ట్ చేస్తున్నారు. దీంతో హీరోయిన్లు అంతా ఇప్పుడు ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి వాటిపై క్రేజ్ సంపాదించేందుకు తెగ కష్టపడుతున్నారు. కొంత మంది బ్యూటీలైతే.. తెరపై కన్నా ఇందులోనే హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ, బోల్డ్ ఫోటలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు ఓ క్రేజీ బ్యూటీ సెక్సీ ఫోజులిస్తూ మగాళ్లకు చెమటలు పట్టిస్తుంది.

ఈ భామ ఎవరనుకుంటున్నారా.. ఇంకెవరు మన బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా. సినిమాలపై ఆసక్తితో ఇంట్లో నుండి పారిపోయి వచ్చింది ఈ చిన్నది. చిన్న చితకా సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. బుజ్జి ఇలా రా, నటరత్నాలు, యద్భావం తద్భవతి, వాలంటైన్స్ నైట్, క్రాంతి వంటి సినిమాల్లో నటించింది. కానీ ఆమెకు పాపులారిటీ వచ్చింది మాత్రం ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన తర్వాతే. దీంతో ఎవరీ ముద్దుగుమ్మ అంటూ జనాలు ఓ రేంజ్ లో చర్చించుకోవడం మొదలు పెట్టారు. అలా ఆ ఒక్క వీడియోతోనే క్యూరియాసిటీని హ్యూజ్ రేంజ్లో పెంచేసింది. ఒక్క సారిగా లైమ్ లైట్‌లోకి వచ్చేసింది.

- Advertisement -

ఆ వెంటనే బిగ్ బాస్ సీజన్ 6లోకి అడుగుపెట్టింది ఈ హైదరాబాదీ పాప. అక్కడ కూడా తన గ్లామర్ ట్రీట్ తో ఆకట్టుకుంది. అలాగే ప్రతి విషయంలోనూ తనకు అడ్డుగా వచ్చిన కంటెస్టెంట్లకు గట్టిగా ఇచ్చి పడేసేది. అయితే టాప్ 5 కంటెస్టెంట్ గా నిలుస్తుంది అనుకున్నారు అంతా… కానీ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. ఏడవ కంటెస్టెంట్‌గా ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది. మొత్తం 98 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఈ బ్యూటీ.. భారీగానే పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక.. ఇన్ స్టాలో తన ఫోటోలతో రచ్చరచ్చ చేస్తుంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచుల టైంలో కూడా సందడి చేసింది.


Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here