Ashu reddy : సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి బిగ్ బాస్ రియాలిటీ షో లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని కోట్లాది మంది తెలుగు ప్రజలకు దగ్గరైన సెలబ్రిటీ అషు రెడ్డి.తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఎల్లప్పుడూ బోల్డ్ కామెంట్స్ మరియు హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ కుర్రకారులకు పిచ్చెక్కించే అషు రెడ్డి ఇప్పుడు జూనియర్ సమంత గా మంచిపేరు తెచ్చుకుంది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఈ బ్యూటీ చేసిన ఒక ఇంటర్వ్యూ సెన్సేషనల్ గా నిల్చింది. అలా ఎప్పుడూ బోల్డ్ గా కనిపిస్తూ, గ్లామర్ షో తో సోషల్ మీడియాలో ఉన్న ప్రేక్షకులకు కనుల విందు చేసే అషు రెడ్డి లేటెస్ట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన ఒక ఫోటో అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలైనట్టు , సెలైన్ ఎక్కిస్తున్నట్టు ఆమె హాస్పిటల్ బెడ్ పైన అలా పడి ఉండడాన్ని చూసి ఆమె అభిమానులు తీవ్రమైన ఆందోళను గురి అవుతున్నారు. ఎప్పుడు చలాకీగా హుషారు గా ఉండే అషు రెడ్డి ని ఇలా చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తొందరగా కోలుకొని బయటపడాలంటూ ఆమె పెట్టిన పోస్ట్ క్రింద కామెంట్స్ చేస్తున్నారు.

ఇక అషు రెడ్డి కెరీర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈమె పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని గా మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఆయన పేరుతోనే ఆమె సోషల్ మీడియా లో సెలబ్రిటీ గా మారింది. అలా సెలబ్రిటీ గా మారిన అషు రెడ్డి కి సినిమాల్లో నటించే అవకాశం కూడా దక్కింది. కానీ ఏది కూడా లీడ్ రోల్స్ కావు, అన్నీ హీరోయిన్ పక్కన స్నేహితురాలి పాత్రలే దక్కాయి. అయితే ఇక నుండి అయినా ఆమెకి హీరోయిన్ రోల్స్ రావాలని ఆమెని అభిమానించే వాళ్ళు కోరుకుంటున్నారు.
