Amardeep : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్‌దీప్ చౌదరి గురించి పరిచయాలు అవసరం లేదు. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువయ్యాడు అమర్ దీప్. ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ షో ద్వారా చాలా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో స్టార్ హీరోకు ఉన్న రేంజ్ లో ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. అదే జోష్ తో వరుస సీరియల్స్ తో పాటు సినిమాలో హీరోగా చేసే అవకాశం కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ మీద ఉంది.

ఆ సినిమాలో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రిత అమర్ దీప్ సరసన హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తోంది. సుప్రిత, అమర్ దీప్ జోడికి కూడా బాగుందంటూ మంచి మార్కులే పడ్డాయి. ఆల్రెడీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇకనుంచి అమర్ దీప్ ఎక్కువగా సినిమాల మీదే ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు రవితేజ తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ఛాన్స్ కోసం అమర్ దీప్ కూడా వెయిట్ చేస్తున్నాడు.
అలాంటి అమర్ దీప్, తేజస్విని ఇంట్లోకి ఓ కొత్త మెంబర్ ఎంటర్ అయింది. కొత్త కారుని కొన్నట్లు అమర్ దీప్ భార్య తేజస్విని ప్రకటించేసింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తేజస్విని ఈ కొత్త కారు ముందు నిల్చొని ఫోజులిచ్చింది. కొత్త కారు కొనేశామన్న సంతోషం ఆమె మొహంలో స్పష్టం కనిపిస్తోంది. కారు ఓపెనింగ్‌లో అమర్ దీప్, తేజస్విని ఫ్రెండ్స్ గ్యాంగ్ సందడి చేసింది. బ్లాక్ కలర్ టాటా సఫారిని కొన్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. దీని ధర పదహారు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మధ్య ఉంటుందని అంచనా.
View this post on Instagram