ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో సక్సెస్ లు అందుకొని, ఎప్పటికీ మర్చిపోలేని పాత్రలు చేసిన హీరోయిన్ భూమిక. సుమంత్ హీరోగా నటించేంచిన ‘యువకుడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈ అందాల తార, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ఖుషి అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ మొత్తాన్ని బద్దలు కొట్టి, ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా, పవన్ కళ్యాణ్ తో సరిసమాయమైన ఇమేజి ఈ సినిమాతో భూమిక సంపాదించింది. ఆయనతో సమానంగా పోటీపడి మరీ నటించిన భూమిక, ఆ తర్వాత మహేష్ బాబు తో ‘ఒక్కడు’ మరియు జూనియర్ ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ వంటి సినిమాలు చేసింది. వీటిల్లో కూడా ఆమె నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలా వరుసగా హిట్ సినిమాలు చేస్తూ వెళ్లిన భూమిక మధ్యలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేసింది. అవి మంచి సక్సెస్ అయ్యాయి కూడా.

అయితే ఆ తర్వాత కొన్నాళ్ళకు భరత్ ఠాకూర్ అనే అతని పెళ్ళాడి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది భూమిక. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె, ఇప్పటికీ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో కొనసాగుతుంది. ఇదంతా పక్కన పెడితే భూమిక భరత్ ఠాకూర్ ని అతి బలవంతం మీద హైదరాబాద్ కి తీసుకొచ్చింది అట. పెళ్ళైన కొత్తలో భూమిక నటన కి దూరంగా ఉంటూ కేవలం నిర్మాతగా మాత్రమే ఇండస్ట్రీ లో కొనసాగాలని చూసింది. ఇందుకోసం భర్త ని కూడా పెట్టుబడులు పెట్టమని చెప్పింది.

సినిమాల్లో నేను పెట్టుబడి పెట్టేంత సీన్ లేదు, అంత డబ్బు వృధా చెయ్యలేను, దయచేసి ఇందులోకి నన్ను లాగొద్దు అని చాలా వరకు చెప్పాడట భరత్. కానీ భూమిక అందుకు ఒప్పుకోలేదు, భర్త చేత పెట్టుబడులు పెట్టించి ఒక సినిమా నిర్మించింది, ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి, విడాకులు దాకా వ్యవహారం వెళ్ళింది, కానీ అక్కినేని నాగార్జున జోక్యం చేసుకొని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చెయ్యడం తో, విడాకులు అనే ఆలోచన ని విరమించుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులిద్దరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.